Bharat Gaurav Rail: సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ‘భారత్ గౌరవ్’ రైలు.. రైలును జెండా ఊపి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్.. 8 రాత్రుళ్లు, 9 పగళ్లు పూరి, కోణార్క్, గయ, వారణాసి వంటి పుణ్యక్షేత్రాలను చుట్టనున్న రైలు
సికింద్రాబాద్ నుంచి తొలిసారి ఓ ‘భారత్ గౌరవ్’ రైలు బయలుదేరింది. దేశంలోని పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఉద్దేశించిన ఈ రైలును దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ జెండా ఊపి ప్రారంభించారు.
Hyderabad, March 19: దేశంలోని పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఉద్దేశించిన ‘భారత్ గౌరవ్’ రైలు (Bharat Gaurav Rail) సికింద్రాబాద్ (Secunderabad) నుంచి బయలుదేరింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. నిన్న ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెల 26 వరకు అంటే 8 రాత్రులు, 9 పగళ్లు సాగుతుంది. యాత్రలో భాగంగా పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి పుణ్యకేత్రాల సందర్శన ఉంటుంది.
The first Bharat Gaurav tourist train originating from the Telugu States commenced its journey from #Secunderabad railway station. More details inside.https://t.co/b2d85aP9RN
— Telangana Today (@TelanganaToday) March 18, 2023
ఆహారం ఏంటి?
తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన స్టేషన్లలో ఆగుతుంది. ఇందులోని ప్రయాణికులకు ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందిస్తారు. ఈ రైలులో ప్రయాణించే యాత్రికులకు కూచిపూడి నృత్యంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
(The above story first appeared on LatestLY on Mar 19, 2023 09:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

