Andhra Pradesh: చంద్రబాబు నాయుడు రోడ్ షోలో అపశృతి, డ్రైనేజీలో పడిపోయిన కార్యకర్తలు, ఏడుమంది మృతి, మరికొందరికి గాయాలు, మృతుల కుటుంబాలకు టీడీపీ పార్టీ తరఫున రూ.10లక్షల ఆర్థిక సాయం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న నెల్లూరు జిల్లా కందుకూరు సభలో అపశృతి చోటు చేసుకుంది. కార్యకర్తలు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగి కొందరు కార్యకర్తలు డ్రైనేజీలో పడిపోయారు. అప్రమత్తమైన తెదేపా నేతలు గాయపడిన కార్యకర్తలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఏడుగురు మృతి చెందినట్టు సమాచారం.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న నెల్లూరు జిల్లా కందుకూరు సభలో అపశృతి చోటు చేసుకుంది. కార్యకర్తలు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగి కొందరు కార్యకర్తలు డ్రైనేజీలో పడిపోయారు. అప్రమత్తమైన టీడీపీ నేతలు గాయపడిన కార్యకర్తలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఏడుగురు మృతి చెందినట్టు సమాచారం.
వెంటనే చంద్రబాబు నాయుడు తన ప్రసంగం ఆపేసి.. ఆసుపత్రి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. కందుకూరులో ఇలాంటి దుర్ఘటన జరగడం తన మనసు కలచివేసిందన్నారు. అమాయకులు చనిపోవడం బాధ కలిగిస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు.
Here's Video
కందుకూరులో చంద్రబాబు పర్యటనలో అపశృతి తొక్కిసలాటతో గుండంకట్ట ఔట్ లెట్ లో జారిపడిన టీడీపీ కార్యకర్తలు – ఇద్దరు మృతి, మరో ఐదుగురికి తీవ్ర గాయాలు - బాధతుల యోగక్షేమాలు తెలుసుకున్నాకే ప్రసంగం చేస్తానంటూ కార్యక్రమాన్ని నిలిపేసి.. హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబు pic.twitter.com/buDC6aPOrF
— తెలుగుదేశంసైనికులు (@TDPMission2024) December 28, 2022
బహిరంగ సభను సంతాప సభగా ప్రకటించిన చంద్రబాబు.. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధితుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యాసంస్థల్లో చదివిస్తామన్నారు.
(The above story first appeared on LatestLY on Dec 28, 2022 10:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

