Madhya Pradesh Shocker: టీ ఇవ్వలేదని చపాతీ కర్రతో భార్యను చంపిన భర్త, మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం, మరో ఘటనలో రెండో భార్యను మొదటి భార్య అంగీకరించలేదని ప్రియురాలతో కలిసి ప్రియుడు ఆత్మహత్య
representational image (photo-Getty)

Bhopal, Dec 27: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. టీ తయారు చేసి ఇవ్వలేదనే కోపంతో ఓ భర్త కట్టుకున్న భార్యను చపాతీ పీటతో కొట్టి (Man kills wife) చంపేశాడు. ఈ ఘటన రాష్ట్రంలో ఉజ్జయిని జిల్లా ఘటియా గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(41) టీ తయారు చేసి ఇవ్వలేదనే (not making tea) కోపంతో భార్య(40)ను చపాతీ పీటతో కొట్టాడు. స్పృహతప్పి పడిపోయిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. విద్యుత్‌ షాక్‌కు గురైందని వైద్య సిబ్బందితో అబద్ధమాడాడు. కొద్ది సేపటి తర్వాత భార్య చనిపోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. పోస్టుమార్టంలో విషయం బయటపడగా భర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

యూపీలో కామాంధుడు దారుణం, ప్రియురాలిని చంపి హోటల్‌ గదిలో రాత్రంతా.., తనతో రాత్రి గడిపేందుకు ఒప్పుకోకపోవడంతోనే హత్య చేశానని వెల్లడి

మరో ఘటనలో తమిళనాడులో ఊటీ బొటానికల్‌ గార్డెన్‌లో ఆత్మహత్యకు యత్నించిన వివాహేతర జంట చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. నీలగిరి జిల్లా ఓల్డ్‌ ఊటీకి చెందిన జైశంకర్‌ (36) పెయింటర్‌. అదే ప్రాంతానికి చెందిన మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఉద్యోగరీత్యా తరచూ బయటి ఊరుకి వెళ్లేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. కొంత కాలంగా వీరు విడిగా ఉంటున్నారు.

జవాన్ కూతురుపై అశ్లీల వీడియో, తొలగించమని అడిగినందుకు సైనికుడిని కొట్టి చంపేసిన ఓ కుటుంబం, గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగులోకి..

పెయింటర్‌ పనులకు వెళ్లే క్రమంలో జైశంకర్‌కు మేట్టుపాళయానికి చెందిన వివాహిత రాధతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత రాధను రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం మేట్టుపాళయం నుంచి రాధను ఊటీలోని తన ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో జైశంకర్‌ కుమార్తెలు తండ్రితో మాట్లాడలేదు. దీంతో జైశంకర్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

గత వారం రాధతో కలిసి ఊటీ బొటానికల్‌ గార్డెన్‌ను చూడటానికి వెళ్లాడు. జైశంకర్, రాధ అక్కడే విషం తాగి స్ఫృహ తప్పి పడిపోయారు. దీంతో పర్యాటకులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ఊటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఇద్దరూ మృతి చెందారు. ఊటీ సెంట్రల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.