Rape | Representational Image (Photo Credits: Pixabay)

Lucknow, Dec 27: యూపీలో ఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనతో కలిసి రాత్రి హోటల్‌లో గడిపేందుకు నిరాకరించిందని ప్రియురాలిని హత్య (man for killing girlfriend) చేశాడు ఓ కామాంధుడైన ప్రియుడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ (Ghaziabad Police arrests man) చేశారు. ఘజియాబాద్‌ పోలీసుల వివరాల ప్రకారం.. యూపీలోని బాగ్‌పట్‌కు చెందిన రచన(44) ఓప్రైవేటు కంపెనీలో క్లర్క్‌గా పనిచేస్తోంది.

ఆమె భర్త రాజ్‌ కుమార్‌ కూలీ పనులు చేస్తుంటాడు. అయితే రచనకు గత కొన్ని నెలలుగా బిహార్‌ రాష్ట్రంలోని భోజ్‌పూర్‌కు చెందిన వ్యక్తితో(34) పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ క్రమంలోనే డిసెంబర్‌ 23న మీరట్‌లో కలుసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. అక్కడే హోటల్‌లో రెండు రాత్రులు గడిపిన తర్వాత ఆదివారం సాయంత్రం ఘాజియాబాద్‌ చేరుకున్నారు.

జవాన్ కూతురుపై అశ్లీల వీడియో, తొలగించమని అడిగినందుకు సైనికుడిని కొట్టి చంపేసిన ఓ కుటుంబం, గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగులోకి..

ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మహిళ తన ప్రియుడు గౌతమ్‌ కలిసి హోటల్‌లో దిగారు. సోమవారం ఉదయం 10.30 నిమిషాలకు గౌతమ్‌ హోటల్‌ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. హోటల్‌ హౌజ్‌ కీపింగ్‌ సిబ్బంది మధ్యాహ్నం గదిలోకి వెళ్లి చూడగా రచన విగత జీవిగా కనిపించింది.

వెంటనే హోటల్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బృందం సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రచన మృతిపై భర్తకు సమాచారం ఇచ్చి.. ఘటనపై విచారణ ప్రారంభించారు.ఇక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడు గౌతమ్‌ను మురాద్‌నగర్‌లోని గంగ కెనాల్‌ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు నేరం ఒప్పుకున్నాడు.

అస్సాంలో మహిళపై యాసిడ్ దాడి, చావు బతుకుల్లో బాధితురాలు, డబ్బుల విషయమై తలెత్తిన వివాదంతో దారుణానికి పాల్పడిన వ్యాపారి

నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గత నాలుగు నెలలుగా రచనతో పరిచయం ఉందని, హోటల్‌లో తనతో కలిసి రాత్రి ఉండేందుకు (she refused to stay overnight in hotel) ఒప్పుకోలేదని, ఇంటికి వెళ్తానని పట్టుపట్టడంతో ఆవేశంతో గొంతు నులిమి చంపినట్లు గౌతమ్‌ అంగీకరించినట్లు న్నట్లు మురాదాబాద్‌ పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రే రచనను హత్య చేసి ఆ రాత్రంతా అదే గదిలో గడిపినట్లు తేలింది. ఐపీసీ సెక్షన్‌ 302, 506 సెక్షన్ల ప్రకారం హంతకుడిపై కేసు నమోదు చేశారు.

భర్త తెలిపిన కథనం ఇదే..

కాగా ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి డిసెంబర్‌ 23న ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు రచన భర్త తెలిపారు. ‘అదే రోజు రాత్రి 8 గంటల వరకు రచన ఇంటికి రాకపోయే సరికి నేను కాల్‌ చేశాను. ఆఫీస్‌లో మీటింగ్‌ ఉంది ఆలస్యం అవుతుందని చెప్పింది. కానీ రాత్రి 11 గంటల వరకు కూడా ఆమె రాకపోవడంతో మళ్ల ఫోన్‌ చేయగా స్వీచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో తన ఆఫీస్‌కు వెళ్లాను. తను ఆ రోజు అసలు ఆఫీస్‌కే రాలేదని అప్పుడే తెలిసింది.

డిసెంబర్‌ 25న ఉదయం 5గంటలకు తనే కాల్‌ చేసి ఇంటికి వస్తున్నట్లు తెలిపింది. కానీ ఎక్కడుందో వెల్లడించలేదు. అదే రోజు రాత్రి 10 గంటలకు మళ్లీ ఫోన్‌ చేసి ఘాజియాబాద్‌లోని హోటల్‌లో ఉన్నట్లు, తనను గౌతమ్‌ ఇంటికి రానివ్వడం లేదని చెప్పి సాయం చేయాలని కోరింది. ఆమె కోసం వెతుకుతుండగానే సోమవారం మధ్యాహ్నం పోలసులు కాల్‌ చేసి రచన చనిపోయినట్లు తెలిపారు’ అని భర్త రాజ్‌ కుమార్‌ తెలిపాడు.