Lover throw acid on Young Women who refused to love in Annamayya District

Annamayya, Feb 14: అన్నమయ్య జిల్లాలో ప్రేమికుల దినోత్సవం రోజున దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిపై ఓ ప్రేమోన్మాది యాసిడ్‌ దాడి చేశాడు. ఓ యువకుడు యువతి తలపై కత్తితో గాయపరిచి అనంతరం ముఖంపై యాసిడ్‌ (Lover throw acid on Young Women) పోశాడు. గాయాలపాలైన బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏప్రిల్‌ 29న ఆమె పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిందితుడిని మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేశ్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

యువతి తలపై కత్తితో పొడిచి..నోట్లో యాసిడ్ పోసి ఆ తర్వాత అత్యాచారం, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో షాకింగ్ సంఘటన

అ‍న్నమయ్య జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23)పై ప్రేమోన్మాది గణేష్‌ యాసిడ్‌ దాడి చేశాడు. ఆమె తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్‌ పోశాడు. దీంతో బాధితురాలు కుప్పకూలి విలవిల్లాడిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇటీవలే గౌతమికి పెళ్లి నిశ్చయం అయ్యింది. ఏప్రిల్‌ 29న ఆమెకు పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్‌తో పెళ్లివివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే గౌతమి పెళ్లిపై రగిలిపోయిన గణేష్‌ ఈరోజు దాడికి పాల్పడ్డారు.

అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి

కాగా గౌతమి మదనపల్లెలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. నిందితుడిని మదనపల్లె అమ్మచెరువుమిట్టకు చెందినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గౌతమి వద్దకు జడ్జీ వెళ్లి బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.