Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణ 19వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, కేసులో తానే వాదనలు వినిపిస్తానంటూ ముందుకు వచ్చిన సునీతా రెడ్డి

వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సునీత రెడ్డి వేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. కేసును ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది.

Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణ 19వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, కేసులో తానే వాదనలు వినిపిస్తానంటూ ముందుకు వచ్చిన సునీతా రెడ్డి
Supreme Court. (Photo Credits: PTI)

వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సునీత రెడ్డి వేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. కేసును ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది.

సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ A.అమానుల్లా నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రాగా కేసులో తానే వాదనలు వినిపిస్తానంటూ సునీతారెడ్డి ముందుకు వచ్చింది. దీనిపై స్పందించిన జస్టిస్ విక్రమ్ నాథ్ ఎవరైనా లాయర్ ను పెట్టుకోవాలని సూచించింది. సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లుథ్రాను సునీతకు సాయం చేయాలని కోరింది.

వైఎస్‌ వివేకా హత్య కేసు, వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ నిరాకరించిన సీబీఐ కోర్టు

విచారణ సందర్భంగా సునీత స్వయంగా వాదనలు వినిపిస్తూ పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలు, అనేక అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇదే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తునకు అవినాష్‌రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదు. ఏప్రిల్‌ 24 తర్వాత 3 సార్లు నోటీసులిచ్చినా విచారణకు ఆయన హాజరుకాలేదు. అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపారు. అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు వెళ్లినా ఎంపీ మద్దతుదారులు వారిని అడ్డుకున్నారు.

వివేకానందరెడ్డి హత్యకేసులో 3నే అవినాశ్‌రెడ్డి అరెస్ట్.. ఆపై రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకుని విడుదల.. గోప్యంగా ఉంచిన సీబీఐ, అవినాశ్‌రెడ్డి వర్గాలు

సాక్షులను ఎంపీ అదే పనిగా బెదిరిస్తూ.. ఇతర నిందితులతో కలిసి వారిని ప్రభావితం చేస్తున్నారు. అవినాష్‌కు ఏపీ ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తోంది. ఆయనకు అధికార పార్టీలోని కీలక వ్యక్తుల మద్దతు ఉంది. సీబీఐ అధికారులపై అవినాష్‌ తప్పుడు ఫిర్యాదులు చేశారు.. వారిపై ప్రైవేట్‌ కేసులు నమోదు చేయించారు. వివేకా హత్య గురించి సీఎం జగన్‌కు ముందే తెలిసింది’’ అని సునీత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సునీత వాదనల అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది.

తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ జారీ చేసిన బెయిల్‌ను సవాల్‌ చేస్తూ సునీతా రెడ్డి వేసిన పిటిషన్‌లో సిబిఐకి నోటీసులు జారీ చేయాలని కోరినా.. సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఈ కేసులో అదనపు పత్రాలు సమర్పించేందుకు సునీతకు అవకాశమిచ్చింది సుప్రీంకోర్టు.

(The above story first appeared on LatestLY on Jun 13, 2023 12:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).