CBI and Avinash Reddy (Photo-File image and Twitter)

Hyderabad, June 9: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy Case) నిందితుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి (YS Avinash Reddy) అరెస్టుకు సంబంధించి కీలక విషయం ఒకటి బయటకు వచ్చింది. అవినాశ్‌రెడ్డిని విచారణకు పిలిచిన సీబీఐ (CBI) ఆయన్ని అరెస్ట్ (Arrest) చేసి.. ఆ వెంటనే బెయిలుపై విడుదల చేసినట్టు సమాచారం. ఈ నెల 3న విచారణ కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు అవినాశ్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకుని వెంటనే ఆయనను విడిచిపెట్టింది.

Monsoon 2023: తెలుగు రాష్ట్రాల్లోకి కాస్త ఆలస్యంగా ప్రవేశించనున్న రుతుపవనాలు, వారం తర్వాతే అంతటా వర్షాలు ఉంటాయని తెలిపిన ఐఎండీ

తెలంగాణ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో..

తెలంగాణ హైకోర్టు గత నెల 31న అవినాశ్‌రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఆయనను అరెస్ట్ చేయాల్సి వస్తే పూచీకత్తులు తీసుకుని వెంటనే విడుదల చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత శనివారం ఆయన విచారణ కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు సాంకేతికంగా అరెస్ట్ చేసి పూచీకత్తులు తీసుకుని విడుదల చేసింది. ఈ విషయం బయటపడకుండా సీబీఐ, అవినాశ్‌రెడ్డి వర్గాలు జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది.

ఎండలకు బైబై, కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, ఇకపై విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ