Monsoon 2023: ఎండలకు బైబై, కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, ఇకపై విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
Monsoon | Representational Image (Photo Credits: Pixabay)

Monsoon 2023 Hits India: భారత వాతావరణ శాఖ (IMD) గుడ్‌న్యూస్‌ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళను తాకినట్లు అధికారికంగా ప్రకటించింది. కాగా రేపు రుతుపవనాలు కేరళను తాకొచ్చని ఐఎండీ అంచనా వేసింది. అయితే.. అనుకున్న దానికంటే ముందుగానే ఇవాళ రుతుపవనాలు కేరళను తాకాయి.

రుతుపవనాల రాక ప్రభావంతో.. రానున్న 48 గంటల్లో కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలుపడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని చెబుతోంది. వారం తర్వాతే అంతటా వర్షాలు ఉంటాయని పేర్కొంది.

తీవ్ర తుపానుగా మారిన సైక్లోన్ బిపాజోయ్, ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను ఇది, దీని ప్రభావం ఎంతంటే..

సాధారణంగా జూన్‌ 1వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేస్తుంటాయి. ఈ ఏడాది దోబూచులాడిన రుతుపవనాలు.. ఆలస్యంగా ప్రవేశించాయి. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పడమట గాలులు కొనసాగుతున్నాయి. అంతకు ముందు పశ్చిమ గాలుల లోతులో పెరుగుదల, ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్, కేరళ తీర ప్రాంతాలపై మేఘావృతం ఉధృతం కావడం వంటి పరిణామాలు కనిపించాయి.

ఆకాశంలో వజ్రంలా మెరిసిపోతున్న శుక్రగ్రహం, సాయంత్రం పూట నేరుగా చూసే అవకాశం, ఎక్కడ, ఎప్పుడు చూడొచ్చంటే?

లక్షద్వీప్‌, కేరళ ప్రాంతాలకు రుతుపవనాలు రుతుపవనాలు విస్తరించాయని  వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ఆగమన ప్రభావంతో కేరళలో గత 24 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలప్పుజా, ఎర్నాకుళం ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తమిళనాడు మీదుగా కదిలేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని ఐఎండీ తెలిపింది. వారం రోజుల్లో ఇవి రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలో మూడురోజులపాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపింది వాతావరణశాఖ. అయితే.. గురు, శుక్రవారాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీకి ఉపశమనం కాస్త ఆలస్యం కావొచ్చని అంచనా వేస్తోంది.