Representational Image | (Photo Credits: IANS)

Tirupati, Mar 4: తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండల పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ వివాహేతర సంబంధం గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడని ఓ భర్తకు ఆమె ప్రియుడు గుండు (Man head shave to his lover husband) కొట్టించాడు. అనంతరం అతనిపై మూత్రం పోశాడు. చంద్రగిరి మండలం రంగంపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మేనల్లుడి ప్రైవేట్ పార్టులపై తుపాకీతో కాల్చిన మామ, సోషల్ మీడియాలో వీడియో వైరల్, రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన

తన భార్యతో హర్షవర్థన్‌ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, ఆమెను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడని, రిప్‌(RIP) అంటూ ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టాడు. అది చూసిన ఆ ప్రియుడు హర్షవర్ధన్‌ రగిలిపోయాడు. బాధిత భర్తను దొరకబుచ్చుకుని గుండు కొట్టించాడు. ఆపై అతనిపై మూత్రం పోశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతామంటూ అతన్ని బెదిరించారు.

భర్తను గొడ్డలితో నరికేసిన భార్య, అయినా కక్ష తీరక అతని ప్రైవేట్ పార్టులను కోసేసిన కసాయి, తాగొచ్చి వేధిస్తుండటమే కారణం

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులకు విషయం చేరింది. విచారణ చేయగా వివాహేతర సంబంధమే దీనికి కారణమని పోలీసులు ధృవీకరించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి హర్షవర్దన్‌తో పాటు అతని అనుచరుడు అన్వర్‌ను, వీళ్లకు సహకరించిన మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జరిగిన అవమానంతో బాధిత భర్త అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.