TTD Clarification On Centipede Row (Credits: X)

Tirumala, Oct 6: తిరుమల శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రి పడిందన్న (TTD Clarification On Centipede Row) ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (TTD) స్పందించింది. ఓ భక్తుడు చేసిన ఈ ఆరోపణలు వాస్తవదూరం అని స్పష్టం చేసింది. దీనికి సహేతుక కారణం కూడా ఉన్నదని వెల్లడించింది.  తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాది భక్తులకు వడ్డించడానికి టీటీడీ సిబ్బంది పెద్ద మొత్తంలో అన్నప్రసాదాలను ఎప్పటికప్పుడు తయారు చేస్తారని, అంత వేడిలో కూడా ఏమాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రి ఉందని ఆ భక్తుడు పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోందని టీటీడీ తన ప్రకటనలో పేర్కొంది.

జానీ మాస్టర్‌ జాతీయ పురస్కారం రద్దు.. లైంగిక దాడి కేసు విచారణ నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేత.. సంచలన నిర్ణయం తీసుకున్న నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు సెల్‌.. అవార్డు కోసం ఢిల్లీ వెళ్ళాల్సిఉన్నదని ఇటీవలే కోర్టు నుంచి బెయిల్ తీసుకున్న జానీ

ఒకవేళ పెరుగన్నం కలపాలన్నా... ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియదిప్పి, ఆ తర్వాత పెరుగు కలుపుతారని వివరించింది. అలాంటి సమయంలో కూడా జెర్రి రూపు ఏమాత్రం చెక్కుచెదరకుండా ఉందనడం పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని భావించాల్సి వస్తోందని టీటీడీ పేర్కొంది. భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

వీడియో ఇదిగో, హార్ట్‌స్టాపర్ సీజన్ 3 సెక్స్ సీన్ ఆన్‌లైన్‌లో లీక్‌, బెడ్ మీద నగ్నంగా రొమాన్స్ చేస్తూ కనిపించిన నిక్, చార్లీలు 

ఇవీ ఆరోపణలు

మాధవ నిలయంలో తాము తిన్న అన్నప్రసాదంలో జెర్రి కనిపించిందని ఓ భక్తుడు వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. అన్నం వేడిలో కూడా ఏమాత్రం చెక్కుచెదరకుండా జెర్రి ఉందని భక్తుడు పేర్కొనడం అనుమానాలకు తావిచ్చింది.

మిడ్ వీక్ ఎలిమినేట్ అయింది ఎవరో తెలుసా?, ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో హౌస్ నుండి బయటకు వచ్చేది ఎవరు?