Hyderabad, Oct 6: లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) కు బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 8న ఆయన స్వీకరించాల్సి ఉన్న జాతీయ అవార్డును (National Award) రద్దు చేశారు. జానీ మాస్టార్ కు ఇచ్చిన ఆహ్వాన పత్రికను రద్దు చేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అత్యాచారం ఆరోపణలు, పోక్సో కేసు నమోదుతో ఆయన విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాత్కాలికంగా ఈ అవార్డును నిలిపేస్తున్నట్టు వివరించింది. కాగా 2022 ఏడాదికిగానూ జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్ ఎంపికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అవార్డును అందుకోవాల్సి ఉంది.
మిడ్ వీక్ ఎలిమినేట్ అయింది ఎవరో తెలుసా?, ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో హౌస్ నుండి బయటకు వచ్చేది ఎవరు?
జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డ్‌ను రద్దు చేసిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్ https://t.co/D25Phct7pi pic.twitter.com/dmfdGELjsT
— Telugu Scribe (@TeluguScribe) October 5, 2024
కోర్టు బెయిల్ ఇచ్చినా..
తన వద్ద పనిచేసిన 21 ఏళ్ల అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడికి పాల్పడ్డట్టు జానీ మాస్టర్ పై ఆరోపణలు ఎదురవ్వడంతో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఢిల్లీలో జాతీయ అవార్డును స్వీకరించాల్సి ఉన్నదన్న జానీ మాస్టర్ అభ్యర్ధనతో రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ నెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఇప్పుడు ఆ అవార్డు రద్దవ్వడం గమనార్హం.