YS Jagan, Memantha Siddham: పేదల భవిష్యత్‌ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి.. చంద్రబాబుకు ఓటేస్తే జగన్ తెచ్చిన పథకాలకు ముగింపే..
చంద్రబాబుకు ఓటేస్తే జగన్ తెచ్చిన పథకాలకు ముగింపే.. చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే.. వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలు చంద్రబాబు మార్క్ రాజకీయం. కొనకనమిట్ల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పేర్కొన్నారు.
పేదల భవిష్యత్‌ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి.. చంద్రబాబుకు ఓటేస్తే జగన్ తెచ్చిన పథకాలకు ముగింపే.. చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే.. వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలు చంద్రబాబు మార్క్ రాజకీయం. కొనకనమిట్ల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పేర్కొన్నారు.
కొనకనమిట్ల సభ వేదికగా టీడీపీ కుట్రలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు దారి అడ్డదారి.. పేదల భవిష్యత్‌ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి. ప్రజల ఎజెండాతో మనం.. జెండాలు కట్టి వాళ్లు.. జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు’’ అంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు.
‘‘వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్దాలు, కుట్రలు చంద్రబాబు మార్క్ రాజకీయం. ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా?. మన అడుగులు ముందుకా.. వెనక్కా అని తేల్చే ఎన్నికలివి. చంద్రబాబుకు ఓటేస్తే జగన్ తెచ్చిన పథకాలకు ముగింపే. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ పాతాళంలో ఉంటాయి’’ అని సీఎం జగన్ ధ్వజమెత్తారు.
‘‘56 నెలలుగా అందుకున్న పెన్షన్లను అర్ధాంతరంగా నిలిపివేయించాడు. ఆదివారమైనా, సెలవురోజైనా వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్లు ఇచ్చేవారు. మండే ఎండలో పేదలను నడిరోడ్డుపై నిలబెట్టాడు. అవ్వాతాతలను చంపుతున్న నరహంతకుడు చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెత్తించింది. అందుకే వాలంటీర్లు లేకుండా చంద్రబాబు కుట్ర. తన రాజకీయం కోసం పేదల్ని చంపే చంద్రబాబు శాడిస్ట్ కాక ఇంకేంటి?. పేదలకు మంచి జరుగుతుంటే చూడలేని వాడే శాడిస్టు’’ అంటూ చంద్రబాబుపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు.