YSR Aarogyasri: ఆరోగ్యశ్రీపై సీఎం జగన్ సంచలన నిర్ణయం, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స, ఈ నెల 18 నుంచి ప్రారంభం

వైఎస్సార్ ఆరోగ్యశ్రీపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 18న సీఎం ప్రారంభించనున్నారు.

YSR Aarogyasri: ఆరోగ్యశ్రీపై సీఎం జగన్ సంచలన నిర్ణయం, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స, ఈ నెల 18 నుంచి ప్రారంభం
Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy (Photo Credit: ANI)

AP CMO Press Meet: వైఎస్సార్ ఆరోగ్యశ్రీపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 18న సీఎం ప్రారంభించనున్నారు.

ఈ సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయం. ఆరోగ్యం, విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలి. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. అందుకనే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కృషి చేసింది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వంచేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణ. దీంట్లో భాగంగానే వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం పేర్కొన్నారు.

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కారు, ప్రతి నెలా జీతాలతో పాటు అలవెన్సులు కలిపి చెల్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు

ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ.25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇవ్వాలి. అత్యంత మానవీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తోంది. వైఎస్సార్‌ఆరోగ్య శ్రీ కార్డు ఉందంటే.. ఆ వ్యక్తికి రూ.25 లక్షలు వరకూ వైద్యం ఉచితంగా లభిస్తుంది. ఎవరికి ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుంది’’ అని సీఎం చెప్పారు.

‘‘ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్‌ దగ్గరకు వెళ్లి చెకప్‌ చేయించుకునేందుకు(ఫాలో అప్‌ కన్సల్టేషన్‌) రవాణా ఛార్జీల కింద రూ.300 చెల్లించాలి. వైఎస్సార్‌ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అన్నదానిపై రూపొందించిన వీడియోను అందరికీ పంపించాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే స్పెషలిస్టు డాక్టర్లకు అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలి. 19నుండి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలి.

రెండోవి­డత వైఎస్సార్‌ లా నేస్తం నిధులు విడుదల చేసిన ఏపీ సీఎం జగన్, 2,807 యువ లాయర్ల అకౌంట్లలో రూ.7,98,95,000 జమ

మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున కార్డుల పంపిణీ కార్యక్రమం. ప్రతి ఇంటికీ ఆరోగ్యశ్రీకార్డుల పంపిణీ జరుగుతుంది. జనవరి నెలాఖరు నాటికి పూర్తి కావాలి. దీంతో పాటు వైఎస్సార్‌ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చన్నదానిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలి’’ అని సీఎం జగన్‌ ఆదేశించారు.

వైఎస్సార్‌ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలి. భావసారూప్యత ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, ఉత్సాహవంతులు ఇందులో పాల్గొనవచ్చు. ఫేజ్‌–2 ఆరోగ్య సురక్ష జనవరి 1 నుంచి ప్రారంభించాలి. ప్రతివారం మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించాలి.

అర్బన్‌ ప్రాంతాల్లో వారంలో ఒక వార్డులో ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉండాలి. జిల్లాల్లో సగం మండలాల్లో మంగళవారం, సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలను నిర్వహించాలి. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలి. స్క్రీనింగ్, మందులు, చికిత్స తదితర అంశాల్లో కిడ్నీ రోగులకు బాసటగా నిలవాలి. డయాలసిస్‌ పేషెంట్లు (సీకేడీ) వాడుతున్న మందులు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలి’’ అని సీఎం జగన్‌ సూచించారు.

సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం టి కృష్ణబాబు, ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డీకే బాలాజీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

(The above story first appeared on LatestLY on Dec 13, 2023 04:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).