YSR Jagananna Colonies: జగనన్న కాలనీల్లో కడుతున్నవి ఇళ్లు కాదు ఊళ్లు, రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపిన సీఎం జగన్

రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చినట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు.

YSR Jagananna Colonies: జగనన్న కాలనీల్లో కడుతున్నవి ఇళ్లు కాదు ఊళ్లు, రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపిన సీఎం జగన్
CM YS Jagan Mohan Reddy (Photo-Twitter/APCMO)

Samarlakota, Oct 12: రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చినట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 80 శాతం ఇళ్లు పూర్తిచేశామని తెలిపారు.

వై ఏపీ నీడ్స్‌ జగన్‌, క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు చెప్పాలని పార్టీ శ్రేణులకు సీఎం జగన్ పిలుపు, ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు

కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం జగనన్న కాలనీలో ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌.. సామర్లకోటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అనిచెప్పడానికి గర్వపడుతున్నానన్నారు.. రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

వయసు మీరిన నిరుద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్, ఏపీపీఎస్సీ నాన్‌ యూనిఫాం పోస్టులు, యూనిఫాం పోస్టులకు వయో పరిమితి పెంపు

ఇప్పటికే 7 లక్షల 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని, రాష్ట్ర వ్యాప్తంగా మరో 14.33 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని సీఎం చెప్పారు.. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందన్నారు. సామర్లకో లేఅవుట్‌లో వెయ్యికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, లక్షల విలువ చేసే ఆస్తిని అక్క చెల్లెమ్మల చేతులో పెడుతున్నామని పేర్కొన్నారు. పేదలకు మంచి చేసే అవకాశం దేవును తనకు ఇచ్చినట్లు సీఎం తెలిపారు.

సీఎం జగన్‌ స్పీచ్ హైలెట్స్..

31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాం.

►రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చాం.

►రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయి.

►కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు.

►రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం.

►రాష్ట్రవ్యాప్తంగా మరో 14.33లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది.

►ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది.

►లక్షల విలువైన ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం.

►ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.75 లక్షలు ఖర్చు చేస్తున్నాం. మౌలిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది.

►ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే స్టీల్‌, సిమెంట్‌ అందిస్తున్నాం.

►వేల కోట్లు ఖర్చు చేసి ఇంటి కలను సాకారం చేస్తున్నాం.

►పేద అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.

►సామర్లకోట లేఔట్లో వెయ్యికిపైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది.

►నవరత్నాల్లోని ప్రతీ పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నాం.

►మన ప్రభుత్వంలో 35‍కు పైగా పథకాలు అమలవుతున్నాయి.

►పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంలో ప్రభుత్వం పనిచేస్తోంది.

►గత ప్రభుత్వం ఏనాడూ పేదల మీద కనికరం చూపలేదు.

►పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారు.

►పేదలకు మంచి జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు.

(The above story first appeared on LatestLY on Oct 12, 2023 12:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).