Hospital Horror: కంటిలో నలక పడిందని వస్తే, సర్జరీ అన్నారు.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు.. హైదరాబాద్ లో ప్రైవేటు కంటి దవాఖాన ముందు బంధువుల ఆందోళన (వీడియో)
హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో దారుణం జరిగింది. బిడ్డ కంటిలో నలక సమస్యతో హాస్పిటల్ ను ఆశ్రయించిన ఆ తల్లిదండ్రులకు చివరకు కడుపుకోతే మిగిలింది.
Hyderabad, Nov 23: హైదరాబాద్ (Hyderabad) లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో (Private Hospital) దారుణం జరిగింది. బిడ్డ కంటిలో నలక సమస్యతో హాస్పిటల్ ను ఆశ్రయించిన ఆ తల్లిదండ్రులకు చివరకు కడుపుకోతే మిగిలింది. కంటిలో నలక సమస్యకు సర్జరీనే పరిష్కారం అంటూ ఆ చిన్నారికి డాక్టర్లు మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో కాసేపటికే ఆ చిట్టి గుండె ఆగిపోయినట్లు బంధువులు తెలిపారు. దీంతో తమకు న్యాయం చేయాలని హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కంటిలో నలక పడిందని చిన్నారి అన్విక(5)ను ఆమె తల్లిదండ్రులు నగరంలోని ఆనంద్ ఐ ఇన్‌స్టిట్యూట్ హాస్పిటల్ లో చేర్పించారు.
Here's Video:
కంటిలో నలక పడిందని వస్తే సర్జరీ అన్నారు.. చిన్నారి మృతి!
హైదరాబాద్ ఆనంద్ ఐ ఇన్‌స్టిట్యూట్ హాస్పిటల్లో దారుణం
చిన్నారి అన్విక(5) కంటిలో నలకను తీసేయాలంటే సర్జరీ చేయాలని సూచించిన వైద్యులు
సర్జరీ చేసే ముందు మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో కాసేపటికే ఆగిన పాప హార్ట్ బీట్
తల్లిదండ్రులకు… pic.twitter.com/rYXqzrsW41
— BIG TV Breaking News (@bigtvtelugu) November 23, 2024
నలకను తీసేయాలంటే సర్జరీ
పాపను పరీక్షించిన వైద్యులు కంటిలో నలకను తీసేయాలంటే సర్జరీ చేయాలని సూచించారు. ఈ క్రమంలో సర్జరీ చేసే ముందు మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో కాసేపటికే పాప హార్ట్ బీట్ ఆగిపోయింది. దీంతో కంగారుపడ్డ వైద్యులు పాప తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే ఎల్బీనగర్ రెయిన్ బో చిల్డ్రన్స్ మెడికేర్ కు అన్వికను తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు పాప స్పృహలో లేదని, మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో తమ బిడ్డను హాస్పిటల్ వాళ్లే చంపేశారని, తమకు తగిన న్యాయం చేయాలని ఆనంద్ హాస్పిటల్ ముందు పాప తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు.
(The above story first appeared on LatestLY on Nov 23, 2024 08:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

