Fire Accident In Mancherial: మంచిర్యాలలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. నిద్రలోనే ప్రాణాలు గాలిలోకి.. ఎవరో కావాలనే ఇంటికి నిప్పు పెట్టినట్టు అనుమానాలు.. వీడియోతో..

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇంటికి నిప్పు అంటుకున్న ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు.

Fire Accident In Mancherial: మంచిర్యాలలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. నిద్రలోనే ప్రాణాలు గాలిలోకి.. ఎవరో కావాలనే ఇంటికి నిప్పు పెట్టినట్టు అనుమానాలు.. వీడియోతో..
Credits: Video Grab

Mancherial, Dec 17: తెలంగాణలోని (Telangana) మంచిర్యాల (Mancherial) జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఇంటికి నిప్పు అంటుకున్న ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. ఇలా నిద్రపోతున్న వారు నిద్రలోనే ప్రాణాలు విడిచారు. మందమర్రి మండలం వెంకటాపూర్‌లో జరిగిందీ ఘటన. ఇంటి యజమాని శివయ్య (50), ఆయన భార్య పద్మ (45), ఆమె అక్క కుమార్తె మౌనిక(23), మరో ఇద్దరు చిన్నారులతో పాటు సింగరేణి ఉద్యోగి శాంతయ్య (50) ఈ ఘటనలో మృతి చెందారు.

ఈఎంఐ కట్టమన్నందుకు ఒంటిపై వేడినూనె పోశాడు! ఫైనాన్స్ రికవరీ సిబ్బందిపై ఎదురుదాడికి దిగిన రాజస్థాన్ వ్యక్తి, తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు ఫైనాన్స్ సిబ్బంది

స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire Rescue Team) మంటలను అదుపు చేశారు. ఇంటికి మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై పోలీసులు (Police) దర్యాప్తు చేస్తున్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇంటికి నిప్పు పెట్టినట్టు అనుమానిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Dec 17, 2022 08:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).