Nagoba Jatara 2025: నేటి నుంచి నాగోబా మహా జాతర.. 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు.. 31న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్‌

ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా మహా జాతరకు అంతా సిద్ధమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం రాత్రి 11 గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభం కానుంది.

Nagoba Jatara 2025: నేటి నుంచి నాగోబా మహా జాతర.. 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు.. 31న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్‌
Nagoba Jatara (Credits: X)

Adilabad, Jan 28: ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా మహా జాతరకు (Nagoba Jatara 2025) అంతా సిద్ధమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం రాత్రి 11 గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభం కానుంది. ఈనెల 30వ తేదీన ఆలయం వెనుక ఉన్న పెద్ద దేవతకు పూజలు నిర్వహించే కార్యక్రమం ఉంటుంది. ఫిబ్రవరి 4 వరకు ఈ జాతర జరుగుతుంది. నాగోబా జాతర ఉత్సవాలను 8 రోజులపాటు ఆదివాసీలు సంప్రదాయ‌, ఆచార వ్యవహారాలతో నిర్వహిస్తారు. కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి జలాన్ని కాలినడకన తీసుకొని వచ్చిన మెస్రం వంశస్థులు కేస్లాపూర్‌ కు చేరుకున్నారు.

ముగ్గురు మైనర్ల ప్రాణాలను తీసిన అతివేగం.. హైదరాబాద్‌ లో ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌ పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి (వీడియో)

31న దర్భార్

రాత్రి 11 గంటలకు మహాపూజతో జాతర ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ పవిత్ర జలాలతో నాగోబాను అభిషేకించనున్నారు. రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహిస్తారు. 31న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్‌ నిర్వహించి గిరిజనుల సమస్యలను తెలుసుకుంటారు. ఫిబ్రవరి 1న భేతల్‌ పూజలు, అనంతరం మండ గాజిలి పూజలు చేయడంతో నాగోబా జాతర అధికారికంగా ముగుస్తుంది.

ఉదయం 11 గంటలకు ముందు, రాత్రి 11 గంటల తర్వాత సినిమా థియేటర్లకు మైనర్లను అనుమతించొద్దు.. తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

600 మంది పోలీసులతో భారీ బందోబస్తు

ఆదిలాబాద్ ​జిల్లా కేస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతరకు దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు ఉంది. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో.. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జాతర కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 600 మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు. వందకుపైగా సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆరు సెక్టార్లుగా పోలీస్ సిబ్బందిని విభజించి.. మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు విధులు నిర్వహించేలా ప్లాన్ చేశారు.

నరాల మీద దాడి చేస్తున్న కొత్త వ్యాధి జీబీఎస్, ఒక్కో ఇంజెక్షన్ ధర వేల రూపాయల పైమాటే, గిలియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).