
Hyderabad, Jan 28: ఉదయం 11 గంటలకు ముందు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏండ్లలోపు పిల్లలను అంటే మైనర్లను (Minors) సినిమా థియేటర్లకు (Cinema Halls) అనుమతించొద్దని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హోం శాఖకు సూచించింది. అన్ని వర్గాల ప్రజలతో ప్రభుత్వం చర్చలు జరిపి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ‘గేమ్ చేంజర్’ సినిమా టికెట్ ధరల పెంపును, అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం పైవిధంగా ఉత్తర్వులు జారీచేశారు. విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.
సెకండ్ షోకు పిల్లల్ని అనుమతించొద్దు.. తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
'పుష్ప 2' తొక్కిసలాట నేపథ్యంలో హైకోర్టు ఆదేశం
సినిమా థియేటర్లకు 16 ఏళ్లలోపు పిల్లలను రా.11 నుంచి ఉ.11 గంటల వరకు అనుమతించొద్దని అధికారులను ఆదేశించిన హైకోర్టు
ప్రభుత్వమే నిజాయితీగా నిర్ణయం తీసుకోవాలని,… pic.twitter.com/pzDbAUMYtb
— BIG TV Breaking News (@bigtvtelugu) January 28, 2025
ఇవీ వాదనలు
సినిమాటోగ్రఫీ నిబంధనల ప్రకారం ఉదయం 8.40లోపు, తెల్లవారు జామున 1.30 తర్వాత సినిమాలను ప్రదర్శించరాదు. ఈ మేరకు పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మల్టీప్లెక్స్ ల్లో ఆఖరాట అర్ధరాత్రి 1.30 గంటలకు ఉంటుందన్నారు. ఆ సమయంలో సినిమాకొచ్చే మైనర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. 'పుష్ప 2' తొక్కిసలాట ఘటననూ ఉదహరించారు. ఈ క్రమంలో పిటిషనర్ తరఫు న్యాయవాదితో ఏకీభవించిన ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది.
మహారాష్ట్రను వణికిస్తున్న కొత్త వ్యాధి, ఇప్పటికే ఒకరు మృతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 73 మంది