MLA Sanjay Kumar: బీఆర్ఎస్ కు మరో షాక్.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే

వరుస ఎన్నికల్లో ఓడిపోతున్న బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌(congress)లోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతోంది.

MLA Sanjay Kumar: బీఆర్ఎస్ కు మరో షాక్.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే
Sanjay Kumar (Credits: X)

Hyderabad, June 24: వరుస ఎన్నికల్లో ఓడిపోతున్న బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌(congress)లోకి బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్(Sanjay Kumar) అధికార పార్టీ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్‌ లో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని ఎ. రేవంత్ రెడ్డి(revanth reddy) సమక్షంలో సంజయ్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2018లో సంజయ్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలిచారు.

తెలంగాణలో ఇకపై రాత్రి 10.30 లోపు షాపులు బంద్.. హోటల్స్, బట్టల దుకాణాలు ఇలా అన్నీ మూసేయల్సిందే.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష అనంతరం సీఎం సూచనల మేరకు పోలీసుల ఆదేశాలు.. కొత్త నిబంధనలపై వ్యాపారుల అసహనం

మొత్తం ఐదుగురు జంప్

సంజయ్ చేరికతో మొత్తం ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్టయింది. ఇటీవలే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. అంతకంటే ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

అంచ‌నాల‌ను అమాంతం పెంచిన క‌ల్కి రిలీజ్ ట్రైల‌ర్, సైన్స్ ఫిక్ష‌న్, యాక్ష‌న్ మూవీ ట్రైల‌ర్ కు ఒళ్లు గ‌గుర్పొడ‌వ‌డం ఖాయం

(The above story first appeared on LatestLY on Jun 24, 2024 08:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).