BRS Formation Day: అట్టహాసంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఈనెల 27న తెలంగాణ భవన్‌లో సెలబ్రేషన్స్, అక్టోబర్‌ లో భారీ బహిరంగసభకు నిర్ణయం

పార్టీ ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ (BRS) రెడీ అవుతోంది. ఈ నెల 25న నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు చేయనుంది. ఈ నెల 27న హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. అదేరోజున కేసీఆర్ (KCR) అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం ఉంటుంది.

BRS Formation Day: అట్టహాసంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఈనెల 27న తెలంగాణ భవన్‌లో సెలబ్రేషన్స్, అక్టోబర్‌ లో భారీ బహిరంగసభకు నిర్ణయం
CM KCR (PIC @ BRS Twitter)

Hyderabad, April 09: పార్టీ ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ (BRS) రెడీ అవుతోంది. ఈ నెల 25న నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు చేయనుంది. ఈ నెల 27న హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. అదేరోజున కేసీఆర్ (KCR) అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించనున్నారు. అనంతరం వాటికి ఆమోదం తెలుపుతారు. అక్టోబర్ 10న వరంగల్ లో బీఆర్ఎస్ మహాసభ విస్తృతంగా జరగనుంది. ఈ నెల 25న తేదీన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించాలని, ఈ సమావేశాలకు పార్టీ నియమించిన ఇన్‌చార్జిలు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన కొనసాగుతాని పేర్కొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోని అన్నీ గ్రామాలు, వార్డుల్లో ఆ రోజు ఉదయమే పండగ వాతావరణంలో పార్టీ జెండాలను ఎగరవేయాలని, గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమాన్ని ముగించుకొని, ఉదయం 10 గంటల కల్లా నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రతినిధులు సభ సమావేశ స్థలికి చేరుకోవాలని శ్రేణులకు సూచించారు.

PM Modi In Hyderabad: కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగా ప్రధాని మోదీ విమర్శలు.. కుటుంబ అవినీతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా వద్దా : మోడీ  

25న రోజంతా పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ నిర్వహణ జరుగుతుందన్నారు. ఆయా సమావేశాల్లో పార్టీ ఆధ్వర్యంలో సాధించిన రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలన్నింటిని విస్తృతంగా చర్చించనున్నట్లు కేటీఆర్‌ (KTR) తెలిపారు. ప్రతి పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ కనీసం 2500 -3వేల మందితో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరిధిలోని గ్రామ, వార్డ్ పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీల డైరెక్టర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, పురపాలికల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, పురపాలక సంఘాల చైర్ పర్సన్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర సీనియర్ నాయకులు ఈ సమావేశాలకు హాజరవుతారని చెప్పారు.

PM Modi Telangana Visit: వందే భారత్ ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుతదో అక్కడకి పోయి జెండా ఊపు..ప్రధాని మోదీపై తలసాని ఘాటు విమర్శలు.. 

వీరందరినీ సమావేశాలకు హాజరయ్యేలా సమన్వయం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలను పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు కేటీఆర్‌ తెలిపారు. సమావేశాలకు హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు అవసరమైన భోజనాలు, ఇతర వసతులను ఏర్పాటు చేయాలని, ప్రస్తుత వేసవికాలం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలకు కేటీఆర్‌ సూచించారు.

PM Modi In Hyderabad: మోడీ పర్యటన సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వద్ద మీడియా ఫై పోలీసులు జులుం 

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి పార్టీ నిర్వహించుకుంటున్న ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలను మరింత విస్తృతంగా, కూలంకషంగా మే నెలాఖరు దాకా కుటుంబ వాతావరణంలో కొనసాగించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్‌చార్జిగా మర్రి రాజశేఖర్ రెడ్డి, గోషామహల్‌కు నంద కిశ్‌ర్ వ్యాస్ బిలాల్, భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి ఎంపీ మాలోతు కవిత నియమించారు. ముగ్గురురు ప్రస్తుతం నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలతో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణకు నియోజకవర్గాలకు బాధ్యులుగా కొనసాగుతారని కేటీఆర్‌ వివరించారు.

(The above story first appeared on LatestLY on Apr 09, 2023 06:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).