వందే భారత్ రైళ్లను ఎన్నిసార్లు ప్రారంభిస్తారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తప్పుడు విమర్శలు చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఆపిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ హయాంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తలసాని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందకపోతే కేంద్రం ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు.
ట్రైన్ 🚆ఎక్కడెక్కడ ఆగుతదో అక్కడకి పోయి జెండా ఊపు 🤣🤣#VandeBharatExpress @YadavTalasani pic.twitter.com/i0CnKMhGUE
— BRS News (@BRSParty_News) April 8, 2023