representational image (photo-Getty)

Shadnagar, Nov 9: షాద్‌నగర్‌లో హాస్టల్ యాజమాన్యం వేధింపులతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య (Degree student Commits Suicide) చేసుకుంది. వికారాబాద్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య ( Shadnagar) ఢిల్లీలో డిగ్రీ చదువుతోంది. కరోనా (Rahul Gandhi) కారణంగా యాజమాన్యం బలవంతంగా హాస్టల్ ఖాళీ చేయించింది.యాజమాన్యం తీరుకు మనస్తాపానికి గురైన ఐశ్వర్ స్వగ్రామానికి వచ్చిన వెంటనే ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. శ్రీరామ్ కాలేజీ యాజమాన్యం (Lady Shri Ram College) వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

షాద్‌ నగర్‌ శ్రీనివాస కాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, సుమతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఐశ్వర్యా రెడ్డి ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని లేడీ శ్రీరామ్ కళాశాలలో బీఎస్సీ సెకండియర్‌ చదువుతోంది. కొవిడ్ నేపథ్యంలో తాజాగా ఇంటికి వచ్చింది. ఈ నెల 3నే ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నిన్న కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ హాస్పిటల్ కు తరలించారు.

నంద్యాలలో కుటుంబం ఆత్మహత్య, నిందితులు ఎవ్వరినీ వదలమని తెలిపిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, సీఐ,హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

కాగా కుటుంబానికి భారం కాకుడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్‌ నోట్‌లో (Suicide Note) తెలిపింది. ఇప్పటికే తన చదువు కోసం తల్లిదండ్రులు ఇంటిని తనఖా పెట్టారన్నది. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే ఐశ్వర్య యూనియన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కాలర్‌షిప్ కింద బీఎస్సీ (హన్స్) గణితం చదవడానికి ఎల్‌ఎస్‌ఆర్‌లో చేరింది. ఇక ఈ ఏడాది మార్చి నుంచి స్కాలర్‌షిప్‌ రాకపోవడంతో పుస్తకాలు, హస్టల్‌ ఫీజు వంటి ఇతర ఖర్చులకు ఇబ్బంది తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Here's Ragul Gandhi Tweet

ఈ ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ట్విట్టర్‌లో స్పందించారు. ఐశ్వర్య కుటుంబానికి తన సంతాపం తెలిపారు. బీజేపీ అనాలోచితంగా విధించిన లాక్‌డౌన్‌ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను నాశనం చేసిందని మండి పడ్డారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్‌ చేశారు. ఈ విచారకరమైన క్షణంలో విద్యార్థి ఐశ్వర్య కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. బీజేపీ అనాలోచితంగా చేసిన నోట్ల రద్దు, లాక్‌డౌన్‌ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది. ఇది నిజం” అని రాహుల్ ట్వీట్‌ చేశారు.