Dil Raju: దిల్ రాజు అల్లుడి లగ్జరీ పోర్షే కారు చోరీ.. గంటలో కారును కేబీఆర్ పార్క్ వద్ద స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు అల్లుడి లగ్జరీ కారు చోరీ కావడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ పోలీసులు సుమారు గంట పాటు శ్రమించి కారు ఆచూకీ కనుగొన్నారు.
Hyderabad, Oct 14: ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అల్లుడి లగ్జరీ కారు (Luxury Car) చోరీ (Theft) కావడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ పోలీసులు సుమారు గంట పాటు శ్రమించి కారు ఆచూకీ కనుగొన్నారు. చోరీ చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేదని అతడి కుటుంబసభ్యులు తెలిపారు. దిల్‌రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని దసపల్లా హోటల్‌కు రూ.1.7 కోట్ల ఖరీదైన తన పోర్షే కారులో వెళ్లారు. కారును హోటల్ వద్దే నిలిపి లోపలికెళ్లిన ఆయన 40 నిమిషాల తరువాత బయటకు వచ్చేసరికి కారు అదృశ్యమైంది. దీంతో, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన డీఐ వీరశేఖర్, డీఎస్సై రాజశేఖర్..సిబ్బందిని రంగంలోకి దింపి సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు.
ఈ క్రమంలో పోర్షే కారు చెక్ పోస్ట్ వద్ద రెడ్ సిగ్నల్ జంప్ చేసినట్టు గుర్తించారు. దీంతో, కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులను వారు ఈ విషయమై అప్రమత్తం చేశారు. అక్కడి పోలీసులు కారును నిలువరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మతిస్థిమితంగా లేకపోవడంతో బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ లో నిందితుడు చికిత్స పొందుతున్నాడని తెలియవచ్చింది. నిందితుడిని మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా పోలీసుల గుర్తించారు.
Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి 235 మంది భారతీయులతో ఢిల్లీ చేరిన రెండో విమానం.. వీడియో ఇదిగో
(The above story first appeared on LatestLY on Oct 14, 2023 10:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

