Singareni Bonus: 16న సింగరేణి దసరా బోనస్.. ఒక్కో కార్మికుడికి 1.53 లక్షలు.. బోనస్ లెక్కింపు ఇలా..
సింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా బోనస్ కింద రూ.711.18 కోట్లను ఈ నెల 16న చెల్లించనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడించారు. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్ అందుతుందని చెప్పారు.
Hyderabad, Oct 6: సింగరేణి కార్మికులకు (Singareni) దసరా (Dasara) కానుకగా లాభాల వాటా బోనస్ కింద రూ.711.18 కోట్లను ఈ నెల 16న చెల్లించనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఇటీవల ప్రకటించిన విధంగా సింగరేణి సంస్థ నిరుడు సాధించిన రూ.2,222.46 కోట్ల లాభంలో 32 శాతాన్ని దసరా పండుగకు వారం రోజుల ముందే చెల్లిస్తున్నట్టు తెలిపారు. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్ అందుతుందని చెప్పారు. సింగరేణి సంస్థను లాభాల దిశగా నడిపిస్తున్న కార్మికులకు గతంలో కన్నా ఎక్కువ శాతాన్ని లాభాల వాటాగా ప్రకటించిన సీఎం కేసీఆర్ కు సింగరేణి ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. గత ఆర్థిక సంవత్సరంలో విధులు నిర్వర్తించిన 46,326 మంది సింగరేణి ఉద్యోగులకు వారు పనిచేస్తున్న గని, శాఖ ఆధారంగా బోనస్ చెల్లిస్తారు. ఎక్కువ హాజరు ఉన్నవారికి ఎక్కువ మొత్తంలో బోనస్ లభిస్తుంది.
Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం.. 40 మందికి గాయాలు
కార్మికులు పనిచేసిన పనిదినాల ఆధారంగా బోనస్ లెక్కింపు ఇలా..
- భూగర్భ గని ఉద్యోగులకు రోజుకు రూ.749.58
- ఓపెన్ కాస్ట్ గనులు, ఇతర సర్ఫేస్ శాఖలు రూ.627.41
- ఇతర విభాగాలు, శాఖల్లో పనిచేసేవారికి రూ.578.69
(The above story first appeared on LatestLY on Oct 06, 2023 09:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

