Heavy Rain Alert For Telangana: తెలంగాణ‌లో ఈ జిల్లాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండండి! మూడు రోజుల పాటూ అతి భారీ నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం, ఐఎండీ అల‌ర్ట్ జారీ

లంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ (IMD Alert) హెచ్చరించింది. ఇవాళ హైదరాబాద్‌ సహా కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ (Orange Alert) జారీ చేసింది. ఆదిలా

Heavy Rain Alert For Telangana: తెలంగాణ‌లో ఈ జిల్లాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండండి! మూడు రోజుల పాటూ అతి భారీ నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం, ఐఎండీ అల‌ర్ట్ జారీ
Telangana heavy Rains, Car stuck at water, Rescued by locals

Hyderabad, SEP 08:  తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ (IMD Alert) హెచ్చరించింది. ఇవాళ హైదరాబాద్‌ సహా కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ (Orange Alert) జారీ చేసింది.

Rain Alert in AP: ఏపీకి మళ్లీ భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.. పూర్తి వివరాలు ఇవిగో! 

ఆదిలాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

Adilabad: వరదల్లో కొట్టుకుపోయిన రైతులు...చివరికి! 

మంగళవారం నాడు కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. బుధవారం నాడు కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నాడు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లిలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం నాడు హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, మెదక్‌, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూలు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్‌ జిల్లాలకు భారీ వర్ష సూచన.

(The above story first appeared on LatestLY on Sep 08, 2024 08:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).