Vijayawada, Sep 8: ఇటీవలి వరదలతో అతలాకుతలమైన ఏపీలో (AP) మళ్లీ భారీ వర్షాలు (Heavy Rains) పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
దుండిగల్ లో విల్లాలను కూల్చేస్తున్న హైడ్రా.. లింగంపల్లి సున్నం చెరువులోనూ అక్రమ నిర్మాణాల తొలగింపు
బెజవాడలో భారీ వర్షం
మొన్నటి వర్షాలకు చిగురుటాకులా వణికిపోయిన విజయవాడలో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు తెలిపారు. విశాఖ, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు చేశారు. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
నల్లమల అడవిలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో మయూరాల నృత్యం హేళ.. వీడియో మీరూ చూడండి!