Hyderabad, Sep 8: హైదరాబాద్ (Hyderabad) లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో భాగంగా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా (HYDRA) తాజాగా మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ మునిసిపాలిటీలో ఆదివారం తెల్లవారుజామున కూల్చివేతలు ప్రారంభించింది. మల్లంపేట కత్వ చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చివేస్తోంది. శ్రీలక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరిట నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. పోలీసు బలగాల భద్రత మధ్య, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత పనులు మొదలయ్యాయి.
నల్లమల అడవిలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో మయూరాల నృత్యం హేళ.. వీడియో మీరూ చూడండి!
Here's Video:
దుండిగల్ మున్సిపాలిటీ పరిదిలోని మల్లంపేట్ పరిధిలో ఉన్న లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ (విల్లాస్) లలో హైడ్రా కూల్చివేతలు. pic.twitter.com/T6O4PwDbVz
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2024
కోర్టుకు పోవడానికి వీలు లేకుండా వారాంతాల్లో మాత్రమే ఉండేలా హైడ్రా కూల్చివేతలు.. ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. pic.twitter.com/cgrZhFjJbb
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2024
సున్నం చెరువులో..
శేరిలింగంపల్లి, బాలానగర్ మండలాల పరిధిలోని సున్నం చెరువులో ఆక్రమణలను కూడా హైడ్రా తొలగిస్తోంది. దాదాపు 10 ఎకరాల మేరకు విస్తరించిన అక్రమ నిర్మాణాలను ఆదివారం ఉదయం నుంచి అధికారులు కూల్చేస్తున్నారు.