Hyderabad Horror: హైదరాబాద్‌లో దారుణం, ఇల్లు శుభ్రం చేద్దామని పిలిచి భార్య తల నరికి మొండెం వేరు చేసి పరారైన భర్త, పోలీసుల అదుపులో నిందితుడు..
హైదరాబాద్ లో అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.అనుమానంతో పాటు కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హత్యచేసి తల, మొండెం వేరు (Beheads Her Over Suspicion of Affair) చేశాడు.
Hyd, Jan 17: హైదరాబాద్ లో అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.అనుమానంతో పాటు కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హత్యచేసి తల, మొండెం వేరు (Beheads Her Over Suspicion of Affair) చేశాడు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌బీనగర్‌కు చెందిన విజయ్‌కుమార్, పుష్పవతి (41) దంపతులు. వీరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో రెండు నెలల క్రితం పుష్పవతి తన కూతురుతో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జేన్‌ఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ 5/13 బ్లాక్‌లో నివాసముంటోంది.
పక్క ఇంటి వ్యక్తిని భార్య గుట్కా అడిగిందని గొంతు కోసుకున్న భర్త, మద్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన
ఓ రోజు జేఎన్‌ఎన్‌యూఆర్ కాలనీకి ఆనుకుని.. ప్రభుత్వం నిర్మించిన నూతన భవన సముదాయంలోని 66/7 బ్లాక్‌లో తన సోదరికి ఇల్లు వచ్చిందని భార్యకు చెప్పి నమ్మించాడు. ఆ ఇంటిని శుభ్రం చేసి వద్దామంటూ (Man Lures Wife to His Sister’s Apartment ) మంగళవారం పుష్పవతి వద్దకు చేరుకున్నాడు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ముందస్తు పథకం ప్రకారమే వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో పొడిచి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా తల, మొండెం వేరుచేసి పరారయ్యాడు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వనస్థలిపురం ఏసీపీ భీంరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ మన్మోహన్, ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అయితే కూతురు మృతి వార్తను తల్లి దండ్రులకు చెప్పగా వారు రాత్రి వరకు రాలేదు. వారితో కూడా ఆమెకు విబేధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jan 17, 2024 11:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

