Hyderabad Metro Update: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. నేడు అర్ధరాత్రి 1 గంట వరకు నడవనున్న మెట్రో రైళ్లు..
గణేశ్ నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగరంలోకి భారీగా తరలివచ్చే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు (HMRL) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిమజ్జనం రోజున రద్దీని తట్టుకునేందుకు నగరంలో మెట్రో రైలు సర్వీసుల వేళలను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
Hyderabad Metro Update: గణేశ్ నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగరంలోకి భారీగా తరలివచ్చే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు (HMRL) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిమజ్జనం రోజున రద్దీని తట్టుకునేందుకు నగరంలో మెట్రో రైలు సర్వీసుల వేళలను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు మాత్రమే నడిచే మెట్రో సేవలను, నిమజ్జనోత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా సెప్టెంబర్ 26వ తేదీ (శనివారం) అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట (1:00 AM) వరకు అందుబాటులో ఉంచనున్నారు.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నాగోల్, రాయదుర్గం, మియాపూర్, ఎల్‌బీనగర్, జేబీఎస్ పరేడ్ గ్రౌండ్, ఎంజీబీఎస్ తదితర ప్రధాన టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో సర్వీసులు అర్ధరాత్రి 1:00 గంటకు బయలుదేరుతాయి. మూడు ప్రధాన కారిడార్లయిన మియాపూర్–ఎల్‌బీనగర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో భక్తుల ప్రయాణాలకు వెసులుబాటుగా అదనపు సర్వీసులను నడపనున్నారు. తెలంగాణలో ఐదు జిల్లాలకు 'రెడ్ అలర్ట్'.. వచ్చేమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు..హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తనున్న వానలు..
నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండే అవకాశం ఉన్నందున, భక్తులు సొంత వాహనాల కంటే మెట్రోను ఆశ్రయించడం మేలని అధికారులు సూచించారు. ముఖ్యంగా నిమజ్జనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చే ఖైరతాబాద్, లక్డీకాపూల్, అమీర్‌పేట్ మరియు ప్రధాన ఇంటర్‌చేంజ్ కేంద్రాలైన ఎంజీబీఎస్, జేబీఎస్ స్టేషన్ల వద్ద అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. ప్రయాణికులు భద్రతా తనిఖీలకు సహకరించాలని, స్టేషన్లలో తోపులాట లేకుండా సిబ్బంది సూచనలు పాటించాలని హెచ్‌ఎంఆర్‌ఎల్ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.