Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, మహిళపై అత్యాచారం చేసి ఆపై నిప్పంటించి చంపేశారు, ప్లాస్టిక్ సంచిలో మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు
హైదరాబాద్‌లో గుర్తుతెలియని మహిళపై దుండగులు అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన పహడీషరీఫ్ పరిధిలోని తుక్కుగూడలో చోటుచేసుకుంది. స్థానిక ఇన్‌స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ-శ్రీశైలం రహదారిపై ఓ ప్లాస్టిక్ సంచి అనుమానాస్పదంగా కనిపించింది.
Hyd, April 12: హైదరాబాద్‌లో గుర్తుతెలియని మహిళపై దుండగులు అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన పహడీషరీఫ్ పరిధిలోని తుక్కుగూడలో చోటుచేసుకుంది. స్థానిక ఇన్‌స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ-శ్రీశైలం రహదారిపై ఓ ప్లాస్టిక్ సంచి అనుమానాస్పదంగా కనిపించింది.
దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు.. సంచిని విప్పి చూడగా అందులో మహిళ మృతదేహం ఉంది. దుండగులు అత్యాచారం చేసి గొంతునులిమి.. ఆపై నిప్పంటించి హతమార్చినట్లు ఘటనాస్థలిలో పరిస్థితులను బట్టి అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Apr 12, 2023 09:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

