Student Suicide: హైదరాబాద్ మియాపూర్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం.. మృతుడి స్వస్థలం ఏపీలోని విజయవాడ
హైదరాబాద్ లోని మియాపూర్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Hyderabad, Nov 23: హైదరాబాద్ (Hyderabad) లోని మియాపూర్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీ చైతన్య కళాశాలలో (Sri Chaitanya College) ఇంటర్ విద్యార్థి ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏపీలోని విజయవాడకు చెందిన కౌశిక్ రాఘవ (17) మియాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి వసతి గృహంలోని తన గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మరణం గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు, వారి బంధువులు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు అర్థాంతరంగా తనువులు చాలిస్తున్నారని నవ తెలంగాణ విద్యార్థి శక్తి సంఘం అధ్యక్షుడు పవన్ ఆరోపించారు. కాలేజీ యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థికి యువతి నగ్న వీడియో కాల్.. ఘట్ కేసర్ లో మరో స్కాం.. ఏంటది??
గత వారం కూడా ఇలాగే
నిజాంపేట్ జర్నలిస్టు కాలనీలోని శ్రీచైతన్య బాలుర వసతిగృహంలో ఉంటూ అదే కాలేజీలో బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజు-రాధిక దంపతుల కుమారుడు జశ్వంత్‌గౌడ్ (17) గత వారమే ఇదే విధంగా ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించడం గమనార్హం.
(The above story first appeared on LatestLY on Nov 23, 2024 09:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

