Formula E Race Case: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్.. 40 ప్రశ్నలతో అధికారులు రెడీ!
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ ముందు విచారణకు హాజరవుతున్నారు.
Hyderabad, Jan 9: ఫార్ములా-ఈ కారు రేసు కేసు (Formula E Race Case) లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేడు ఏసీబీ ముందు విచారణకు హాజరవుతున్నారు. ఉదయం 9:30కి నందినగర్ ఇంటి నుంచి బయలుదేరి, 10 గంటలకు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి న్యాయవాదితో సహా చేరుకుంటారు. విచారణ నిమిత్తం అధికారులు దాదాపు 40 ప్రశ్నలను సిద్ధం చేసినట్టు సమాచారం. ఫార్ములా-ఈ కారు రేసుకి సంబంధించి నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇప్పటికే ఓసారి ఆయన ఏసీబీ విచారణకు వచ్చారు. తనతోపాటూ లాయర్ ని కూడా అనుమతించాలన్నారు. అందుకు ఏసీబీ ఒప్పుకోలేదు. దాంతో వెనక్కి వెళ్లిపోయిన ఆయన.. మరోసారి విచారణకు వస్తున్నారు. విచారణ తర్వాత కేటీఆర్ ని అరెస్టు చేస్తారనే వాదన వినిపిస్తోంది. ఈ వాదనను బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావు గృహ నిర్బంధం.. కోకాపేటలో భారీగా మోహరించిన పోలీసులు.. ఎందుకంటే?? (వీడియో)
నేడు ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్
ఫార్ములా - ఈ రేస్ కేసులో ఉదయం 10 గంటలకు తన న్యాయవాది రామచందర్ రావుతో విచారణకు హాజరు
IAS అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించనున్న అధికారులు
FEO, Ace NextGen, HMDA కు మధ్య జరిగిన తొలి త్రైపాక్షిక ఒప్పందం టైంలో… pic.twitter.com/lYXvAAiL4u
— BIG TV Breaking News (@bigtvtelugu) January 9, 2025
లాయర్ కు అనుమతి
ఏసీబీ విచారణకు న్యాయవాదితో వెళ్లేందుకు కేటీఆర్ కు హైకోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కేటీఆర్ ను విచారించే ఏసీబీ కార్యాలయంలో దర్యాప్తు గదికి పక్కనే ఉన్న గ్రంథాలయ గదిలో న్యాయవాది ఉండేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. దర్యాప్తు ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలన్న ప్రతిపాదనను నిరాకరించింది. గురువారం జరిగే విచారణ తీరును బట్టి అవసరమైతే పిటిషనర్ మళ్లీ కోర్టుకు రావచ్చని తెలిపింది. ఈ నెల 6 న ఏసీబీ దర్యాప్తుకు న్యాయవాదిని వెంటబెట్టుకుని వెళ్తే పోలీసులు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై బుధవారం భోజన విరామ సమయంలో హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది.
'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరణ.. అయితే, టిక్కెట్ ధరల పెంపునకు ఓకే!
(The above story first appeared on LatestLY on Aug 15, 4697 05:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

