Hyderabad, Jan 9: పుష్ప-2 (Pushpa-2) సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించిన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఆచితూచి వ్యవహరిస్తున్నది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా 10వ తేదీన విడుదలవుతోంది. టిక్కెట్ ధరల పెంపునకు, బెనిఫిట్ షోల కోసం సినిమా బృందం విజ్ఞప్తి చేసింది. అర్ధరాత్రి గం.1కి పెంచిన ధరతో బెనిఫిట్ షోను అనుమతించాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. సినిమా విడుదల రోజున ఉదయం 4 గంటల నుంచి ఆరు షోలకు అనుమతి ఇచ్చింది. సినిమా టిక్కెట్ ధరల పెంపునకు కూడా అనుమతి ఇచ్చింది.
'గేమ్‌ఛేంజర్' టికెట్స్ పెంపునకు గ్రీన్ సిగ్నల్- కానీ నో ప్రీమియర్స్ https://t.co/68AM3H3jGW
— ETVBharat Andhra Pradesh (@ETVBharatAP) January 9, 2025
సినిమా విడుదల రోజున ఆరు షోలకు
- సింగిల్ స్క్రీన్ లో రూ.100
- మల్టీప్లెక్స్ లో రూ.150 పెంపు
జనవరి 11 నుంచి 19 వరకు ఐదు షోలకు
- సింగిల్ స్క్రీన్స్ లో రూ.50
- మల్టీప్లెక్స్ లలో రూ.100 పెంపు