Tirumala, Jan 9: తిరుమలలో (Tirumala) ఘోర విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తుల మధ్య భారీగా తోపులాట (Stampede Update) చోటుచేసుకొని తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వారిలో ఐదుగురు మహిళలు ఉన్నట్టు గుర్తించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు తిరుపతిలో పర్యటించనున్నారు. రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించనున్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆయన పరిహారం ప్రకటిస్తారు.
చంద్రబాబు తిరుపతి పర్యటన షెడ్యూల్ ఇలా...
- ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు.
- 11.10 నిమిషాలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు.
- 11.15 నిమిషాలకు విజయవాడ విమానాశ్రయం నుంచి విమానంలో తిరుపతికి బయలుదేరుతారు.
- 12.00కు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.
- 12 నుంచి గం.3 వరకు రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో క్షతగాత్రులను పరామర్శిస్తారు. ఈవో, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.