
Vij, March 08: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'శక్తి టీమ్స్'ని(Shakti Teams) ప్రారంభించారు సీఎం చంద్రబాబు(Chandrababu). బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పిల్లలపై వేధింపులు అరికట్టడం, నేరాలను నిరోధించడం, తక్షణ సాయం అందించి వారికి రక్షణ కల్పించడమే లక్ష్యంగా 'శక్తి టీమ్స్' పనిచేయనున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ఈ మేరకు శక్తి టీమ్స్‌ని ప్రారంభించారు.
మహిళల రక్షణకు 13 సేవలతో "శక్తి యాప్" సేవలందించనుండగా శక్తి యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన 5-7 నిమిషాల్లో పోలీసులు వచ్చేలా ఏర్పాటు చేశారు. అలాగే, మహిళలు, పిల్లలపై నేరాలను నివారించడానికి(Chandrababu Launches Shakti Teams), ఐజీ ర్యాంకు అధికారి నేతృత్వంలో వుమెన్ & చైల్డ్ సేఫ్టీ వింగ్ ని ప్రారంభించారు. మహిళల భద్రతకు, ఆర్థిక భరోసాకు సాయంగా నిలిచే విభాగాలు, పథకాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లాంఛ్ చేశారు.
స్వయం సహాయక బృందాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు SERP ద్వారా రూ.1826.43 కోట్ల బ్యాంకు లింకేజి రుణాలు ఇచ్చారు. స్త్రీనిధి ద్వారా లక్ష మంది మహిళలకు తక్కువ వడ్డీకి రూ.1,000 కోట్ల రుణాలు ఇప్పించనుండగా చేనేత మహిళలకు ఉచితంగా నూలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఏడాదిలో లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని ప్రారంభించారు చంద్రబాబు. ONDC వేదికగా వావ్ జీని యాప్‌ని ఉపయోగించుకుని లక్షకు పైగా డ్వాక్రా ఉత్పత్తులు రికార్డు స్థాయిలో రూ.5.13 కోట్లకు అమ్మడం ద్వారా సాధించిన గిన్నిస్ రికార్డుని ముఖ్యమంత్రికి అందజేశారు. స్టార్ బక్స్ లాగా మన అరకు కాఫీ కూడా ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ కావాలి... దీనికి మహిళలు ముందుకు రావాలి అన్నారు.
ప్రతి గ్రామంలో అరకు కాఫీ అవుట్ లెట్స్ ఉండాలి అని తెలిపారు. అలాగే నాడు ఆర్టీసీలో మహిళలని కండక్టర్లుగా పెట్టాం.... అలాగే మహిళలకు షీ ఆటోలు ఇచ్చాం. ఇప్పుడు ర్యాపిడోతో ఒప్పందం చేసుకున్నాం అన్నారు.అలాగే 1.50 లక్షల మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. మహిళలకు ప్రోత్సాహం ఇస్తూ, మహిళా ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, బ్యుటీషియన్లు, గృహోపకరణాల మరమ్మతుదారులకు ఆర్థిక చేయూత ఇచ్చే విధంగా హోం ట్రయాంగిల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు చంద్రబాబు.