Hyderabad, Jan 9: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావును (Harish Rao) పోలీసులు గృహ నిర్బంధం (Ex Minister Harishrao Under House Arrest) చేశారు. గురువారం ఉదయం కోకాపేటలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. హరీశ్ రావును కలవడానికి కూడా ఎవరినీ అనుమతించడం లేదు. ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు.
'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరణ.. అయితే, టిక్కెట్ ధరల పెంపునకు ఓకే!
BreakingNews :
మాజీ మంత్రి హరీశ్ రావు గృహ నిర్బంధం
హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరింపు.@BRSHarish @BRSparty @hydcitypolice pic.twitter.com/zFR4fRoP4G
— Telangana Awaaz (@telanganaawaaz) January 9, 2025
లాయర్ కు అనుమతి
ఏసీబీ విచారణకు న్యాయవాదితో వెళ్లేందుకు కేటీఆర్ కు హైకోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కేటీఆర్ ను విచారించే ఏసీబీ కార్యాలయంలో దర్యాప్తు గదికి పక్కనే ఉన్న గ్రంథాలయ గదిలో న్యాయవాది ఉండేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. దర్యాప్తు ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలన్న ప్రతిపాదనను నిరాకరించింది. గురువారం జరిగే విచారణ తీరును బట్టి అవసరమైతే పిటిషనర్ మళ్లీ కోర్టుకు రావచ్చని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 6 న ఏసీబీ దర్యాప్తుకు న్యాయవాదిని వెంటబెట్టుకుని వెళ్తే పోలీసులు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై బుధవారం భోజన విరామ సమయంలో హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది.