Hyderabad Shocker: ఎల్బీనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం, తన ప్రేమను ఒప్పుకోలేదని యువతిపై కత్తితో దాడి, అడ్డం వచ్చిన యువతి తమ్ముడిని విచక్షణారహితంగా పొడిచి చంపిన ఉన్మాది, యువతి పరిస్థితి విషమం
హైదరాబాద్ ఎల్బీ నగర్ లో (LB nagar) ప్రేమోన్మాది ఘాతుకానికి (Lover Attack) పాల్పడ్డాడు. ఆర్టీసీ కాలనీలో అక్క, తమ్ముడిపై శివకుమార్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తమ్ముడు చింటూ (Chintu) చికిత్స పొందుతూ చనిపోయాడు. అక్క సంఘవి (Sanghavi) పరిస్థితి విషమంగా ఉంది.
Hyderabad, SEP 03: హైదరాబాద్ ఎల్బీ నగర్ లో (LB nagar) ప్రేమోన్మాది ఘాతుకానికి (Lover Attack) పాల్పడ్డాడు. ఆర్టీసీ కాలనీలో అక్క, తమ్ముడిపై శివకుమార్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తమ్ముడు చింటూ (Chintu) చికిత్స పొందుతూ చనిపోయాడు. అక్క సంఘవి (Sanghavi) పరిస్థితి విషమంగా ఉంది. కామినేని ఆసుపత్రిలో సంఘవికి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడ్డ నిందితుడిని బంధించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. షాద్ నగర్ కి చెందిన సంఘవి, పృథ్వీ అలియాస్ చింటూ అక్క, తమ్ముళ్లు. ఎల్బీనగర్ లోని ఆర్టీసీ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సంఘవి హోమియోపతి ఫోర్త్ ఇయర్ చదువుతోంది. చింటూ బీటెక్ పూర్తి చేసి జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు.
ఎల్బీనగర్ లో దారుణం.. అక్క, తమ్ముడి పై కత్తితో దాడి
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఓ అక్క, తమ్ముడి పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి - #LBNagar #Sister #brother pic.twitter.com/0t4XCo9NCh
— Dial News (@dialnewsinfo) September 3, 2023
రామంతాపూర్ కి చెందిన శివకుమార్.. సంఘవిని ప్రేమించాడు. ఆ విషయం మాట్లాడేందుకు శివకుమార్ (Shivakumar) సంఘవి ఇంటికి వెళ్లాడు. ఇదే సమయంలోనే శివకుమార్, సంఘవి, ఆమె తమ్ముడు చింటూ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో శివకుమార్ కత్తితో సంఘవి, చింటూపై దాడి చేశాడు. అరుపులు విన్న స్థానికులు నిందితుడు శివకుమార్ ని రూమ్ లో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆదివారం మధ్యాహ్నం 2గంటల 45 నిమిషాలకు సంఘవి ఇంటికి శివకుమార్ వెళ్లాడు. ఏం జరిగిందో కానీ సంఘవి తమ్ముడు చింటూ, శివకుమార్ గొడవపడ్డారు. ఈ క్రమంలో ఆవేశంతో ఊగిపోయిన శివకుమార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో సంఘవి, చింటూలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఘర్షణ జరిగి కిటికీ అద్దాలు పగులగొట్టిన శబ్ధం వచ్చింది. దాంతో అక్కడికి చేరుకున్న స్థానికులు దాడికి పాల్పడ్డ శివకుమార్ ని రూమ్ లో బంధించారు. తీవ్ర గాయాలతో పడున్న సంఘవి, చింటూలను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చింటూ మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
(The above story first appeared on LatestLY on Sep 03, 2023 09:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

