Motkupalli Narasimhulu: దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం.. కేసీఆర్‌పై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు.. ఆరు నెలలుగా అపాయింట్ మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ అవమానిస్తున్నారని ఆవేదన
దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం కేసీఆర్ అని బీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Hyderabad, Sep 25: దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం కేసీఆర్ (KCR) అని బీఆర్ఎస్ (BRS) నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నిరసనదీక్ష చేపట్టారు. టీడీపీ నేతలు సహా పలువురు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా ఉండగా నేరుగా వారి వద్దకు వెళ్లేవాడిని. కానీ, కేసీఆర్ మాత్రం దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం’ అంటూ ఆయన అన్నారు.
@KTRBRS *మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు*
– సీఎం కేసీఆర్ ను నమ్మి మోసపోయా
– కేసీఆరే నన్ను పిలిచారు.. ఆయనే దూరం పెట్టారు
– 6 నెలలుగా అపాయింట్ మెంట్ ఇవ్వకుండా సీఎం కేసీఆర్ నన్ను అవమానించారు
– ఎన్టీఆర్, చంద్రబాబు దగ్గరకే ఈజీగా వెళ్లగలిగాను
– కేసీఆర్ మాత్రం సమయం ఇవ్వటం లేదు (1/3)
— Vijay Kumar Tokala (@vktokala) September 24, 2023
– దళితుడు ఇంట్లోకి వస్తే ఆవు మూత్రంతో శుభ్రం చేసుకునే రకం కేసీఆర్
– చంద్రబాబు అరెస్ట్ పై కేసీఆర్ స్పందించాలి
– చంద్రబాబు అరెస్ట్ పై స్పందించకుంటే బీఆర్ఎస్ కే నష్టం
– నా మద్దతు లేకుండా నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు
– మోత్కుపల్లి నరసింహులు (2/3)
— Vijay Kumar Tokala (@vktokala) September 24, 2023
@KTRBRS *మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు*
– బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు
– 30 నియోజకవర్గాల్లో ఏపీ సెటిలర్స్ గెలుపోటములను ప్రభావితం చేస్తారు
– మోత్కుపల్లి నరసింహులు (3/3)#WeWillGiveItBackKTR
— Vijay Kumar Tokala (@vktokala) September 24, 2023
30 నియోజకవర్గాలను నిర్ణయించేది వాళ్లే
తెలంగాణలోని 30 నియోజకవర్గాల్లో ఏపీ నుంచి వచ్చిన వారు గెలుపోటములను ప్రభావితం చేస్తారని, చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ స్పందించకుంటే ఆయనకే నష్టమని హెచ్చరించారు. బీఆర్ఎస్‌లోకి తనంత తానుగా వెళ్లలేదని, కేసీఆర్ పిలిస్తేనే వెళ్లానని గుర్తు మోత్కుపల్లి గుర్తు చేశారు. ఆ తర్వాత తనను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా అపాయింట్ మెంట్ అడుగుతున్నా ఇవ్వకుండా అవమానిస్తున్నారని అన్నారు.
(The above story first appeared on LatestLY on Sep 25, 2023 10:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

