Hyderabad, Sep 25: టాలీవుడ్ లో (Tollywood) సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు (Drugs Case) రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ వివాదంలో సినీ ఫైనాన్షియర్లు సహా మరికొందరిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్‌న్యాబ్) అరెస్ట్ చేసింది. ఈ కేసులో సినీనటుడు నవదీప్ (Navdeep) ను కూడా అధికారులు విచారించారు. ఇదే కేసులో దర్శకుడు మంతెన వాసువర్మను (Director Vasu Varma) ఈ నెల 5న మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: సినీ ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్ ప్రకంపనలు
డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న అరెస్ట్‌ల పరంపర
తాజాగా బస్తి సినిమా డైరెక్టర్ మంతెన వాసువర్మ అరెస్ట్
అలాగే సినీ రైటర్ మన్నెరి పృథ్వీకృష్ణా అరెస్ట్
వారి నుంచి 70 గ్రాముల కొకైన్, పెద్దమొత్తంలో విదేశి మద్యం, గంజాయి స్వాధీనం
కేసు…
— BIG TV Breaking News (@bigtvtelugu) September 24, 2023
అలా బయటకు
సినీ రచయిత మన్నెరి పృథ్వీకృష్ణ అలియాస్ దివాకర్, పూణెకు చెందిన ఈవెంట్ నిర్వాహకుడు రాహుల్ తెలోర్ ఇదే కేసులో జూన్ లో అరెస్ట్ అయ్యారు. వీరిద్దరిని జూన్ 19న అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 70 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో వీరి ద్వారా వాసువర్మ పేరు కూడా వెలుగులోకి రావడంతో ఈ నెల 5న ఆయనను అరెస్ట్ చేశారు. వీరికి డ్రగ్స్ సరఫరా చేసే ముంబైకి చెందిన విక్టర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.