Tirumala, Sep 25: డిసెంబర్ 1 నుంచి 22 వరకు వ్యవధికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను (TTD Special Darshan Tickets) నేటి ఉదయం 10 గంటలకు టీటీడీ (TTD) విడుదల చేయనుంది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా, శ్రీవాణి ట్రస్ట్ కోటా టికెట్లను టీటీడీ విడుదల ఆదివారం చేసింది. తిరుమల బ్రహ్మోత్సవాలు ఏడోరోజైన ఆదివారం ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి 7 గంటలకు శ్రీనివాసుడు చంద్రప్రభ వాహనంపై ఊరేగాడు.
*తిరుమల*
సెప్టెంబర్ 25 వ తేదీ ఉదయం 10 గంటలకు 300/- డిసెంబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ..
డిసెంబర్ ఒకటి నుంచి 22 వ తేదీ వరకు 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్న టిటిడి...
డిసెంబర్ 23 న వైకుంఠ ఏకాదశి, 24 న ద్వాదశి…
— B V S💎FFF (@1975BVS) September 24, 2023
రేపటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
ఆదివారం బ్రేక్, ప్రత్యేక దర్శనాలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. మంగళవారంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో భక్తులు బయట క్యూలైన్‌లో వేచిఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శానికి 18 గంటల సమయం పడుతున్నది.