TS New CM Revanth Reddy: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి!.. నేడు ప్రమాణ స్వీకారం.. కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక, ఖర్గే
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం కానున్నది. అనంతరం అధిష్ఠానంతో సంప్రదించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది గవర్నర్ కు తెలియజేస్తారు.
Hyderabad, Dec 4: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి (TS New CM Revanth Reddy) నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ (CLP) సమావేశం కానున్నది. అనంతరం అధిష్ఠానంతో సంప్రదించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది గవర్నర్ కు తెలియజేస్తారు. అయితే, పార్టీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం.. పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క సహా పలువురు నేతలు సీఎం రేసులో ఉన్న నేపథ్యంలో సీఎల్పీ భేటీ తర్వాతనే సీఎం అభ్యర్థి పేరును ఖరారు చేస్తారని తెలుస్తోంది.
ఎవరెవరు హాజరంటే?
ప్రస్తుత అసెంబ్లీని గవర్నర్ రద్దు చేసిన అనంతరం కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరయ్యే అవకాశం ఉంది.
(The above story first appeared on LatestLY on Dec 04, 2023 08:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

