Hyderabad Horror: హైదరాబాద్ లో దారుణం.. 18వ అంతస్తు భవనం నుంచి దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య.. అసలేమైంది?
హైదరాబాద్ లో ఘోరం జరిగింది. కూతురుతో కలిసి ఓ తల్లి 18వ అంతస్తు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అనుమానాస్పద స్థితిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Hyderabad, Sep 30: హైదరాబాద్ (Hyderabad) లో ఘోరం జరిగింది. కూతురుతో కలిసి ఓ తల్లి 18వ అంతస్తు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు (Suicide) పాల్పడింది. అనుమానాస్పద స్థితిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని భీమవరానికి చెందిన మానస (30) తన భర్త, మూడేండ్ల కూతురితో కలిసి నార్సింగి సమీపంలోని మైహోం అవతార్ లో నివాసం ఉంటున్నారు. భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మానస గృహిణి. అయితే, ఆదివారం రాత్రి కూతురు కృషితో కలిసి భవనం 18వ అంతస్తు నుంచి దూకి మానస ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీలను పంచనామాకు తరలించారు.
కారణం అదేనా?
మృతురాలి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. మానస గత కొంతకాలంగా తీవ్రమైన వెన్నునొప్పితో బాధ పడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆమె కూతురితో కలిసి సూసైడ్ చేసుకోవడానికి అనారోగ్యమే కారణం కావచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
(The above story first appeared on LatestLY on Sep 30, 2024 08:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

