Hyderabad Metro official handle on X hacked(X)

Hyderabad, SEP 29: మెట్రో రైల్ రెండో దశ (Metro second-phase) పనులకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మొత్తం 116.2 కిలోమీట‌ర్ల‌లో మెట్రో రెండు ద‌శ నిర్మాణం జ‌ర‌గ‌నుంది. రూ. 32,237 కోట్ల అంచనా వ్య‌యంతో మెట్రో రైలు రెండో ద‌శ (Hyderabad Metro) చేప‌ట్ట‌నున్నారు. రెండో ద‌శ‌లో కొత్త ఫ్యూచ‌ర్ సిటీకి మెట్రోను ఏర్పాటు చేయ‌నున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి స్కిల్ వ‌ర్సిటీ వ‌ర‌కు 40 కి.మీ. మేర మెట్రో మార్గాన్ని నిర్మించ‌నున్నారు. ఇటీవ‌లే మెట్రో రైలు రెండో ద‌శ డీపీఆర్‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్షించారు.ఎయిర్‌పోర్ట్‌ మెట్రో అలైన్‌మెంట్‌ మార్పులు చేశారు.

Here's the Tweet

 

ఆరాంఘ‌ర్ – బెంగ‌ళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో ఖ‌రారు చేశారు. నాగోల్ – శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు 36.6 కిలోమీట‌ర్ల మార్గానికి ఆమోదం తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌ కారిడార్‌లో 1.6 కిలోమీట‌ర్ల మేర భూగ‌ర్భంలో మెట్రో వెళ్ల‌నుంది.

Rain in Hyderabad: హైద‌రాబాద్ లో జోరు వ‌ర్షం, ప‌లు ప్రాంతాల్లో వాహ‌న‌దారుల‌కు తీవ్ర ఇబ్బందులు 

రూ. 8 వేల కోట్ల అంచ‌నా వ్య‌యంతో ఫోర్త్ సిటీకి మెట్రోను ఏర్పాటు చేయ‌నున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం అనుమతుల కోసం త్వ‌ర‌లోనే మెట్రో రెండో ద‌శ డీపీఆర్‌లు పంప‌నున్నారు. మొద‌టి ద‌శ‌లో 3 కారిడార్ల‌లో 69 కి.మీ. మేర మెట్రో న‌డుస్తుంది. రెండో ద‌శ‌లో మ‌రో 6 కారిడార్ల‌లో 11.2 కి.మీ. మేర మెట్రో ప్ర‌యాణించ‌నుంది. రెండో ద‌శ పూర్త‌యితే మొత్తం 9 కారిడార్ల‌లో 185 కి.మీ. మెట్రో ప‌రుగులు తీయ‌నుంది.