Child Porn Warning: ఫోన్ ఉందని చిన్న పిల్లల పోర్న్ ఓపెన్ చేయకండి, ట్రాక్ చేసి జైలుకు పంపుతున్న తెలంగాణ పోలీసులు, నెల రోజుల్లోనే 43 మంది అరెస్ట్

ఇంటర్నెట్ లో పోర్న్ కంటెంట్ కు కొదవ లేదు. ముఖ్యంగా చిన్న పిల్లల పోర్న్ వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా మంది వాటిని చూస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో చైల్డ్ పోర్నోగ్రఫీపై ఉక్కుపాదం మోపేలా తెలంగాణ పోలీసులు (Hyderabad cops) తాజాగా హెచ్చరికలు జారీ చేశారు

Child Porn Warning: ఫోన్ ఉందని చిన్న పిల్లల పోర్న్ ఓపెన్ చేయకండి, ట్రాక్ చేసి జైలుకు పంపుతున్న తెలంగాణ పోలీసులు, నెల రోజుల్లోనే 43 మంది అరెస్ట్
(Representative Photo | Photo Credit: Pixabay)

ఇంటర్నెట్ లో పోర్న్ కంటెంట్ కు కొదవ లేదు. ముఖ్యంగా చిన్న పిల్లల పోర్న్ వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా మంది వాటిని చూస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో చైల్డ్ పోర్నోగ్రఫీపై ఉక్కుపాదం మోపేలా తెలంగాణ పోలీసులు (Hyderabad cops) తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఇంటర్నెట్ లో చిన్న పిల్లల అశ్లీల (చైల్డ్‌పోర్న్‌) వీడియోలు, ఫొటోలు, ఇతర అభ్యంతరకర కంటెంట్‌ పదే పదే చూసినా, షేర్ చేసినా జైలుకెళ్లడం ఖాయమని (Child Porn Warning) హెచ్చరించారు.

చైల్డ్ పోర్నోగ్రఫీపై హైదరాబాద్ పోలీసులు కొరడా, 44 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు, చూసినా, ప్రమోట్ చేసినా 5 ఏళ్లు జైలు శిక్ష

వివిధ ఆన్‌లైన్‌ వేదికల ద్వారా చైల్డ్‌పోర్నోగ్రఫీని దొంగతనంగా చూస్తున్న వారిని (Browsing child porn ) గుర్తించి జైళ్లకు పంపుతున్నారు. బాలల లైంగిక వేధింపు అంశాలను, వీడియోలను, ఫొటోలను సర్క్యూలేట్‌ చేసేవారిపై నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) అందించే సమాచారం ఆధారంగా నిఘా పెట్టారు. ఈ క్రమంలో నెల వ్యవధిలోనే 43 మందిని అరెస్టు చేశారు.

రైల్వే స్టేషన్‌లో సమాచారం బదులు పోర్న్ వీడియోలు డిస్‌ప్లే, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేలలో సెక్స్ వీడియోలు రావడంతో షాక్‌కు గురైన ప్రయాణికులు

ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులతో పాటు విద్యార్థులు సైతం దీనికి అలవాటు పడుతున్నట్టు గుర్తించారు. అయితే, మనదేశంలో సీశామ్‌ ఫైల్స్‌ చట్టవిరుద్ధమని, సెక్షన్‌ 67(బి), ఐటీ చట్టం 2000 ప్రకారం శిక్షార్హులని తెలంగాణ సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ తెలిపారు.ఇలాంటి కేసుల్లో అన్ని ఫోన్ల ఐపీ అడ్రస్‌లు జాతీయస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోలీసులకు తెలిసిపోతాయన్నారు. ఈ కేసుల్లో నేరం నిరూపితమైతే ఏడేండ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉన్నదని స్పష్టం చేశారు.

(The above story first appeared on LatestLY on Mar 20, 2023 12:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).