Kollur Double Bedroom Houses Inauguration: కొల్లూరులో డబుల్‌ బెడ్‌రూమ్‌ టౌన్‌షిప్‌ ప్రారంభించిన సీఎం కేసీఆర్‌, రూ.1,489.29 కోట్ల వ్యయంతో హౌసింగ్ నిర్మాణం

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో (Kollur) రెండో దశ కింద చేపట్టిన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.

Kollur Double Bedroom Houses Inauguration: కొల్లూరులో డబుల్‌ బెడ్‌రూమ్‌ టౌన్‌షిప్‌ ప్రారంభించిన సీఎం కేసీఆర్‌, రూ.1,489.29 కోట్ల వ్యయంతో హౌసింగ్ నిర్మాణం
Kollur 2BHK House Inauguration (Photo-Twitter/TS CMO)

Hyd, June 22: సంగారెడ్డి జిల్లా కొల్లూరులో (Kollur) రెండో దశ కింద చేపట్టిన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.

సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా ఒకేచోట ఏకంగా 15,660 ఇండ్ల నిర్మాణాన్ని తెలంగాణ సర్కారు చేపట్టింది. నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూరులో ఈ ఆదర్శ టౌన్‌షిప్‌ను నిర్మించింది. నాణ్యతలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా కార్పొరేట్‌ హంగులతో పేదల కోసం కలల సౌధాలను నిర్మించింది. రూ.1,489.29 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్‌ అపార్ట్‌మెంట్లకు తీసిపోకుండా సకల హంగులతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిర్మించారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభం సందర్భంగా రోడ్లు మూసివేత, ప్రత్యామ్నాయ మార్గాలివే!

ఈ టౌన్‌షిప్‌లో 145 ఎకరాల విస్తీర్ణంలో 1432.50 కోట్ల రూపాయల వ్యయంతో ఒకే చోట 15,600 ఇళ్ల నిర్మాణం జరిగింది. సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించారు. G+9 నుంచి G+10, G+11 అంతస్తుల వరకు టౌన్‌షిప్‌ నిర్మాణం జరిగింది. మొత్తం 117 బ్లాక్‌లు, బ్లాక్‌కి 2 లిఫ్ట్‌ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. టౌన్‌షిప్‌లో మురుగునీటి శుద్ధి ప్లాంట్, స్కూల్స్, 118 వాణిజ్య దుకాణాల నిర్మాణం జరిగింది.

(The above story first appeared on LatestLY on Jun 22, 2023 02:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).