Telangana: పెండింగ్ చలానాలు ఈ వెబ్‌సైట్‌లో కడుతున్నారా, అయితే మీ డబ్బులు పోయినట్లే, అలర్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
తెలంగాణలో పెండింగ్ చలాన్లను క్లియర్ చేయటానికి వాహనదారులకు భారీ రాయితీని ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే. అయితే దీన్ని అవకాశంగా తీసుకుని సైబర్ మోసగాళ్లు ఫేక్ వెబ్‌సైట్ క్రియేట్లతో రెచ్చిపోతున్నారు. www.echallantspolice.in పేరుతో నకిలీ వెబ్‌సైట్ సృష్టించారు.

ఈ సైట్‌లో పేమెంట్ చేయొద్దని, www.echallan.tspolice.gov.in/publicview వెబ్‌సైట్‌లో మాత్రమే నగదు పే చేయాలని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.పేటీఎం, మీ-సేవా సెంటర్లలో పెండింగ్ చలానాలు క్లియర్ చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు. ఈనెల 10వ తేదీ వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది. చలాన్ల క్లియరెన్స్‌పై కన్నేసిన సైబర్ నేరగాళ్లు.. నకిలీ వెబ్‌సైట్ ద్వారా చలాన్లు వసూలు చేస్తూ వాహనదారుల జేబులు కొల్లగొడుతున్నారు.
నకిలీ వెబ్ సైట్లను గుర్తించిన అధికారులు సోషల్ మీడియా ద్వారా వాహనదారులను అప్రమత్తం చేశారు. నకిలీ వెబ్ సైట్లలోకి వెళ్లి డబ్బులు చెల్లించ వద్దని హెచ్చరించారు. నకిలీ వెబ్‌సైట్ క్రియేట్ చేసిన వాళ్లని గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు పడ్డారు.
(The above story first appeared on LatestLY on Jan 02, 2024 02:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).