Telangana Dasara Holidays 2026:తెలంగాణ పాఠశాలలకు కీలక అప్‌డేట్.. అక్టోబర్ 1 నుంచి SA-1 పరీక్షలు.. అక్టోబర్ 10 నుంచి 13 రోజుల పాటు దసరా సెలవులు..

తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ అత్యంత కీలకమైన అకడమిక్ షెడ్యూల్‌ను వెల్లడించింది. 2026-27 విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అభ్యసిస్తున్న విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-1) పరీక్షలను అక్టోబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది

Telangana Govt.jpg

Telangana Dasara Holidays 2026: తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ అత్యంత కీలకమైన అకడమిక్ షెడ్యూల్‌ను వెల్లడించింది. 2026-27 విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అభ్యసిస్తున్న విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-1) పరీక్షలను అక్టోబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్థులకు అక్టోబర్ 10 నుండి 22వ తేదీ వరకు వరుసగా 13 రోజుల పాటు దసరా సెలవులను ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

హైదరాబాద్‌లో పాతాళానికి భూగర్భ జలాలు..ఈ నెల వర్షాలు లేకుంటే తీవ్ర నీటి కష్టాలు తప్పవని హెచ్చరిక.. ఏడాదిలోనే 4.84 మీటర్ల పతనం

పరీక్షల నిర్వహణ కోసం తరగతుల వారీగా విద్యాశాఖ ప్రత్యేక సమయాలను కేటాయించింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 6వ, 8వ తరగతుల విద్యార్థులకు ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, అలాగే 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఉదయం సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం సెషన్‌లో 7వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.

ప్రస్తుత విద్యా సంవత్సరంలో మొత్తం 227 పని దినాలను నిర్దేశించిన విద్యాశాఖ, ఇప్పటికే ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (FA-1, FA-2) ప్రక్రియలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించింది. విద్యార్థులు తమ తరగతికి కేటాయించిన సమయాలను సరిచూసుకుని, పాఠశాలల ద్వారా విడుదలయ్యే సబ్జెక్టుల వారీ టైమ్‌టేబుల్‌కు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించింది. అదే సమయంలో ఉపాధ్యాయులు కూడా సిలబస్ రివిజన్ పూర్తి చేసి పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement