Holidays in Telangana: సంక్రాంతికి ఆరు రోజులు సెలవులు, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సెలవుల లిస్ట్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఈ మధ్యే దసరా, బతుకమ్మ పండగల సెలవులను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై కూడా ప్రకటన చేసింది. దీపావళి పండగకు ఒక్క రోజు మాత్రమే సెలవు ఇచ్చింది.
ఈ మధ్యే దసరా, బతుకమ్మ పండగల సెలవులను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై కూడా ప్రకటన చేసింది. దీపావళి పండగకు ఒక్క రోజు మాత్రమే సెలవు ఇచ్చింది. డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండగకు ఐదు రోజులు సెలవులు ప్రకటించింది. డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఐదు రోజుల పాటు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని తెలిపింది. ఇతర స్కూళ్లకు మాత్రం క్రిస్మస్ నాడు (డిసెంబర్ 25) మాత్రమే సెలవు ఇచ్చింది.
తెలంగాణ పాఠశాలలకు అక్టోబర్ 13 నుంచి 25 వరకూ దసరా, బతుకమ్మ సెలవులు.. 26న రీఓపెనింగ్
ఈ విద్యా సంవత్సరంలో వచ్చే మరో పెద్ద పండగ సంక్రాంతికి ఆరు రోజులు సెలవు ప్రకటించింది. భోగి, సంక్రాంతి, కనుమ పండగలతో మొత్తం ఆరు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ఖరారు చేసింది. కాగా, దసరా, బతుకమ్మ కోసం అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పాఠశాలలకు 13 రోజుల సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
(The above story first appeared on LatestLY on Oct 04, 2023 01:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

