Telangana Shocker: అర్థరాత్రి గొడవ, భార్యను దారుణంగా గొడ్డలితో నరికి చంపిన భర్త, అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరార్, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో దారుణమైన ఘటన (Telangana Shocker) జరిగింది. జిల్లాలోని కందుకూరు మండలంలో దాసర్లపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో గొడ్డలితో భార్య సారమ్మను అతి కిరాతకంగా (husband-killed-wife-in-kandukur) హతమార్చాడు భర్త.

Telangana Shocker: అర్థరాత్రి గొడవ, భార్యను దారుణంగా గొడ్డలితో నరికి చంపిన భర్త, అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరార్, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Murder (Photo Credits: Pixabay)

Hyderabad, April 25: తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో దారుణమైన ఘటన (Telangana Shocker) జరిగింది. జిల్లాలోని కందుకూరు మండలంలో దాసర్లపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో గొడ్డలితో భార్య సారమ్మను అతి కిరాతకంగా (husband-killed-wife-in-kandukur) హతమార్చాడు భర్త. గత కొన్ని రోజులుగా భార్య, భర్తకు ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడంటం లేదు. భార్యపై అనుమానంతో ఉన్న భర్త. శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.

భార్యపై అప్పటికే ఆగ్రహంతో ఉన్న భర్త సహనం కోల్పోయి ఒక్కసారిగా గొడ్డలితో భార్య సారమ్మను హతమార్చాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల స‌మాచారంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.కుటుంబ త‌గాదాలే ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

రూంలో బ్యాచిలర్స్ గొడవ, కూరగాయలు కట్ చేయలేదని ఫ్రెండ్‌పై కత్తితో దాడి, స్నేహితుని పరిస్థితి విషమం, హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

మరో ఘటనలో బిడ్డను చంపిన తల్లి తానూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. బిడ్డను చంపిన తల్లి తానూ ఉరివేసులపోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మయూర్‌భంజ్‌ జిల్లా బారిపాడకు చెందిన సుధేందుగిరి పాత అల్వాల్‌ భరత్‌నగర్‌లో నివాసముంటూ సిద్దిపేటలోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎనిమిదేళ్ల కిత్రం బిష్ణుప్రియ(30)తో అతడి వివాహం జరిగింది. వీరికి మూడున్నర సంవత్సరాల కూతురు హ్రితిక ఉంది.

ఆన్‌లైన్‌ క్లాస్‌..బాలిక నోరు నొక్కేసి అత్యాచారం, ఆపై వీడియో తీసి పలుమార్లు లైంగిక దాడి చేసిన ఇంటి ఒనర్ కొడుకు, జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలో దారుణ ఘటన

ఈ నెల 22వ తేదీన సుధేందుగిరి యథావిధిగా ఉద్యోగానికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. కూతురు మృతి చెంది ఉండడం, బిష్ణుప్రియ ఉరివేసుకొని కనిపించడం గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. మొదట కూతురును చంపి తాను ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సుధేందుపరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలిచివేసింది.కొని ఆత్మహత్య

(The above story first appeared on LatestLY on Apr 25, 2021 12:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).