Goreti Venkanna: గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, వల్లంకి తాళం సాహిత్యానికి అవార్డు, హర్షం వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్, అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
కేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అవార్డులను గురువారం ప్రకటించింది. కవి, రచయిత ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు (Telangana MLC Goreti Venkanna) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. 2021 సంవత్సరానికి గాను గోరటి వెంకన్నను తెలుగులో సాహిత్యంలో ఎంపికచేశారు.
Hyd, Dec 30: కేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అవార్డులను గురువారం ప్రకటించింది. కవి, రచయిత ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు (Telangana MLC Goreti Venkanna) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. 2021 సంవత్సరానికి గాను గోరటి వెంకన్నను తెలుగులో సాహిత్యంలో ఎంపికచేశారు. ‘వల్లంకి తాళం’ సాహిత్యానికి ఈ అవార్డుకు (Sahitya Akademi Award) ఎంపికశారు. తగుళ్ల గోపాల్ కు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ లభించింది. కడియం రచనకు ఈ అవార్డుకు (Central Sahitya Akademi award) ఎంపిక చేశారు. బాల సాహిత్య పురస్కారానికి దేవరాజు మహారాజు ఎంపికయ్యారు. ‘నేను అంటే ఎవరు’ నాటకానికి ఈ పురస్కారం లభించింది. 2021కి గాను మొత్తం 20 భాషల్లో అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ప్రముఖ కవి, శాసన మండలి సభ్యుడు గోరటి వెంకన్నకు ప్రతిష్టాత్మక ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2021’ దక్కడం పట్ల సీఎం కేసీఆర్ (CM KCR) హర్షం వ్యక్తంచేశారు. దైనందిన జీవితంలోని ప్రజాసమస్యలను సామాజిక తాత్వికతతో కళ్లకు కడుతూ వెంకన్న అందించిన సాహిత్యం ప్రపంచ మానవుని వేదనకు అద్దం పడుతుందని చెప్పారు. మానవ జీవితానికి, ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని.. మనిషికి ఇతర జంతు పక్షిజీవాలకు ఉన్న అనుబంధాన్ని గోరటి వెంకన్న అత్యున్నతంగా ఆవిష్కరించారని సీఎం కొనియాడారు.
తెలంగాణ మట్టి వాసనలను తన సాహిత్యం ద్వారా గోరటి వెంకన్న విశ్వవ్యాపితం చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా తన సాహిత్యం ద్వారా గొప్ప పాత్ర పోషించారని తెలిపారు. గోరటి సాహిత్యానికి దక్కిన ప్రతిష్టాత్మక సాహితీ గౌరవం, తెలంగాణ మట్టి మనిషి జీవనతాత్వికకు దక్కిన గౌరవంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోరటి వెంకన్న ఏకనాథం, రేల పూతలు, అల చంద్రవంక వంటి రచనలతో పేరు తెచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. తనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. సాహిత్య అకాడమీ అవార్డు రావడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేటిజం పెరుగుతున్న సమయంలో సాహిత్యానికి గౌవరం పెరగాలని తెలిపారు. కృష్ణశాస్త్రి నుంచి శ్రీశ్రీ వరకు అందరి ప్రభావం తనపై ఉంటుందని చెప్పారు. వాగ్గేయం కుటుంబ నేపథ్యం వల్ల వచ్చిందని, జరుగుతున్న పరిస్థితులను వాగ్గేయం చేయడం కొంత ఇబ్బందేనని పేర్కొన్నారు. ఓటముల నుంచే గెలుపుకు బాట పడుతుందని, తాను రాసిన ప్రతిదీ వ్యక్తిగత అనుభవంతోనే వచ్చిందని తెలిపారు. అదేవిధంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌కు సాహిత్యంపై మంచి అవగాహన ఉందని చెప్పారు.
(The above story first appeared on LatestLY on Dec 30, 2021 09:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

